News December 10, 2025
ఆదిలాబాద్: తెర వెనుక రాజకీయం షురూ

ఉమ్మడి జిల్లాలో గురువారం జరగనున్న తొలి విడత పంచాయతీ ఎన్నికలకు ప్రచారం గడువు మంగళవారం సాయంత్రంతో ముగిసింది. బహిరంగ ప్రచార పర్వం ముగియడంతో అభ్యర్థులు ఇప్పుడు తెర వెనుక రాజకీయాలకు పదును పెట్టారు. ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహాలు రచిస్తూ, గ్రామాల్లోని కీలక కుల సంఘాల పెద్దలను, ముఖ్య నాయకులను కలుస్తున్నారు. తమకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరుతూ, మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల్లో అభ్యర్థులు నిమగ్నమయ్యారు.
Similar News
News December 11, 2025
రోహిత్ గొప్ప హృదయానికి అది నిదర్శనం: జైస్వాల్

సౌతాఫ్రికాతో ఇటీవల భారత్ ఆడిన మూడో వన్డేలో యశస్వి జైస్వాల్ తన కెరీర్‌లోనే తొలి సెంచరీ చేసిన విషయం తెలిసిందే. అయితే క్రీజులో కుదురుకునేందుకు ఆయన చాలా ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో మరో ఎండ్‌లో ఉన్న రోహిత్ తనతో మాట్లాడుతూ భరోసా ఇచ్చినట్లు జైస్వాల్ తెలిపారు. ‘నేను రిస్క్ తీసుకుంటా. నువ్వు ప్రశాంతంగా టైం తీసుకొని ఆడు’ అని తనతో చెప్పినట్లు వివరించారు. ఇది తన గొప్ప హృదయానికి నిదర్శనం అని కొనియాడారు.
News December 11, 2025
15న నెల్లూరులో భారీ ర్యాలీ: కాకాణి

నెల్లూరులో ఈనెల 15వ తేదీన వైసీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రకటించారు. సర్వేపల్లిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో 17మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేస్తున్నందుకు నిరసనగా తమ పార్టీ కోటి సంతకాల సేకరణ చేసిందన్నారు. అన్ని చోట్లా సేకరించిన సంతకాలను 15న జిల్లా కార్యాలయానికి చేరుస్తామన్నారు.
News December 11, 2025
అలా తిట్టడం వల్లే ‘రాజా సాబ్’ తీశా: మారుతి

నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్లు, తిట్టేవాళ్లకి చాలా థాంక్స్ అని డైరెక్టర్ మారుతి అన్నారు. అలాంటి వారు లేకపోతే తాను ‘రాజా సాబ్’ తీసేవాడిని కాదని తెలిపారు. వారంతా తమ పనులన్నీ మానుకొని, పాజిటివిటీని చంపుకొని మరొకరి కోసం టైం పెడుతున్నారని సెటైరికల్ కామెంట్స్ చేశారు. తమలోని నెగిటివిటీని వారు పంచుతున్నారని, అదంత ఈజీ కాదన్నారు. ఎవరైనా తిడితే ఎనర్జీగా మార్చుకొని ముందుకెళ్లాలని ఓ ఈవెంట్‌లో సూచించారు.


