News March 2, 2025
ఆదిలాబాద్: తెలుగు విభాగం ఆధ్వర్యంలో ఉపన్యాసం

ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్ట్స్ అండ్ కామర్స్ తెలుగు విభాగం ఆధ్వర్యంలో శనివారం విస్తృత ఉపన్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అతిక్ బేగం అధ్యక్షత వహించారు. ఇందులో భాగంగా విశ్రాంత తెలుగు భాషోపాధ్యాయులు, రచయిత, చిత్ర కారుడు, ఆకాశవాణి వ్యాఖ్యాత సామల రాజవర్థన్ ‘తెలుగులో భాషా దోషాలు’ అనే అంశంను విద్యార్థులకు వివరించారు.
Similar News
News November 6, 2025
జాతీయ స్థాయి గిరిజన భాషా సదస్సుకు ADB వాసి

మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయ స్థాయి గిరిజన భాషా సదస్సుకు ఆదిలాబాద్ జిల్లా వాసికి ఆహ్వానం అందింది. ఈ నెల 11, 12 తేదీల్లో ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి గిరిజన భాషా పరిరక్షకులు, మేధావులు, రచయితల సదస్సులో పాల్గొనాలని ప్రభుత్వ ఉపాధ్యాయుడు తొడసం కైలాస్‌కు ఆహ్వానం లభించింది. జాతీయ స్థాయి సదస్సుకు ఆహ్వానించడం ఎంతో గర్వకారణం అని కైలాస్ అన్నారు.
News November 6, 2025
ప్రతి గర్భిణీ, బాలింతలకు పరీక్షలు చేయాలి: ADB కలెక్టర్

ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు సమయానికి చికిత్స అందకపోవడం వంటి కారణాల వల్ల తక్కువ బరువుతో పుట్టిన శిశువుల సంఖ్య పెరుగుతోందని కలెక్టర్ రాజర్షి షా ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య, శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గర్భిణీ, బాలింతలను గుర్తించి సమయానికి వైద్యపరీక్షలు చేయాలని వైద్యాధికారులకు సూచించారు. సరైన పోషకాహారం అందించడంలో సిబ్బంది చురుకుగా వ్యవహరించాలన్నారు.
News November 6, 2025
నేటి బంద్ వాయిదా: ADB కలెక్టర్

రాష్ట్ర జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 6 నుంచి పంట కొనుగోళ్ల నిరవదిక బంద్‌ను వాయిదా వేసినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. రాష్ట్ర మంత్రులు, ఏపీసీ, సెక్రటరీ, సీసీఐ సీఎండీ, జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి మధ్య జరిగిన చర్చలు సఫలం అయ్యాయన్నారు. దీంతో ఈ నెల 6 నుంచి చేపట్టే కొనుగోళ్ల నిరవధిక సమ్మెను వాయిదా వేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.


