News April 30, 2024
ఆదిలాబాద్: తేలిన ఓటర్ల లెక్క.. వారితోనే గెలుపు

ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఓటర్ల లెక్క తేలింది. పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 16,50,175 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తేల్చారు. జాబితాలో పురుషుల కంటే మహిళా ఓటర్లు 36,338 మంది ఎక్కువగా ఉండటం విశేషం. మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ వారిదే ఆధిపత్యం. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో మహిళా ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Similar News
News September 11, 2025
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ఫలితాలు విడుదల

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ ఫలితాలు విడుదలయ్యాయని ఆదిలాబాద్ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సంగీత, వర్సిటీ ఉమ్మడి జిల్లా కో-ఆర్డినేటర్ జాగ్రామ్ తెలిపారు. 2025 జూన్, జూలై నెలలో నిర్వహించిన డిగ్రీ 2వ సంవత్సరం, 4వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు పేర్కొన్నారు. https://online.braou.ac.in/UGResults/cbcsResults అనే వెబ్‌సైట్‌ను సందర్శించి ఫలితాలను చూసుకోవచ్చని సూచించారు.
News September 11, 2025
అంబేడ్కర్ వర్సిటీలో చేరేందుకు రేపే ఆఖరు

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఈనెల 12వ తేదీ వరకు గడువు ఉందని సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంగీత, ఉమ్మడి జిల్లా కో-ఆర్డినేటర్ జగ్రామ్ తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గిరిజనులకు ఉచితంగా విద్య అందించే సౌకర్యం కూడా అందుబాటులో ఉందని వారు పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
News September 11, 2025
ADB: గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించాలి: కలెక్టర్

శిశు మరణాలను తగ్గించాలంటే గర్భిణులకు సరైన పర్యవేక్షణ, ప్రసవ సమయంలో నాణ్యమైన వైద్య సేవలు అందించడం అవసరమని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. జిల్లాలో శిశు మరణాల రేటును ఒక అంకెకు తగ్గించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం 15గా ఉన్న శిశు మరణాల రేటును 10 కన్నా తక్కువకు తీసుకురావడానికి వ్యూహాలను రూపొందించాలని పేర్కొన్నారు.