News October 24, 2025
ఆదిలాబాద్: దొంగ బాబాలు.. ఘరానా మోసాలు

ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ బాబాలు యథేచ్ఛగా చెలరేగిపోతున్నారు. ఐదు నెలల్లో ఐదు వేర్వేరు ఘటనల్లో కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. ఇటీవల బాలికపై లైంగిక దాడి, నకిలీ వైద్యం పేరిట అమాయకుల నుంచి లక్షల్లో వసూలు చేసిన ముఠాలపై కేసులు నమోదైనా, ఇలాంటి ఆగడాలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. మూఢ నమ్మకాలను సొమ్ము చేసుకుంటున్న ఈ నకిలీ స్వాములపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరముంది.
Similar News
News October 24, 2025
మళ్లీ అదే సిడ్నీ.. కోహ్లీ రేపు ఏం చేస్తారో?

రేపు ఆస్ట్రేలియాతో 3వ వన్డే జరిగే సిడ్నీ వేదిక విరాట్ కోహ్లీ అభిమానులను కలవరపెడుతోంది. 10 నెలల క్రితం ఆయన ఇదే స్టేడియంలో చివరి టెస్ట్ ఆడి రిటైర్మెంట్ ప్రకటించారు. ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీట్ అవుతుందా అనేదే ఫ్యాన్స్ ఆందోళన. తొలి 2 మ్యాచుల్లో డకౌట్, 2వ వన్డేలో అభిమానులకు కోహ్లీ <<18081069>>అభివాదం<<>> చేయడం మరింత కలవరపెడుతున్నాయి. దీంతో రేపు ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మీరేమంటారు?
News October 24, 2025
ప్రకాశం: విద్యుత్ సమస్య తలెత్తితే కాల్ చేయండి.!

ప్రకాశం జిల్లాలో ఎక్కడైనా విద్యుత్ లైన్లు తెగిపడితే తప్పక విద్యుత్ శాఖ ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాలని విద్యుత్ శాఖ SE కట్టా వెంకటేశ్వర్లు సూచించారు. ఒంగోలులోని విద్యుత్ భవన్‌లో ఆయన మాట్లాడారు. తుఫాన్ నేపథ్యంలో జిల్లా ప్రజలు జాగ్రత్త వహించాలన్నారు. ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు విరిగినా కంట్రోల్ రూమ్ నంబర్ 9440817491కు సమాచారం అందించాలని ఆయన కోరారు.
News October 24, 2025
పెనుగొండ: గంజాయి కలిగి ఉన్న యువకులు అరెస్ట్

పెనుగొండ మండలం సిద్ధాంతం గోదావరి బ్రిడ్జ్ వద్ద గంజాయితో ఉన్న ఐదుగురు యువకులను పెనుగొండ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి 5.630 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పెనుగొండకు చెందిన సాయి నాగేంద్ర, దుర్గాసాయి, చందు, దానేశ్వరరావు, సిద్ధాంతానికి చెందిన సాయిరాంను అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరుపరుస్తామని ఎస్సై గంగాధర్ తెలిపారు.


