News October 10, 2025
ఆదిలాబాద్: నామినేషన్ వేస్తున్నారా..? అయితే..!

@ వయస్సు 21 సంవత్సరాలు నిండాలి
@ సంబధిత ఓటరు లిస్టులో ఓటరు గా నమోదై ఉండాలి.
@ SC/ST/BC వారైతే క్యాస్ట్ సర్టిఫికెట్ జత పరచాలి.
@ డిపాజిట్ సొమ్ము కట్టాలి
@ విద్యార్హతలతో కూడిన అఫిడవిటీ ఇద్దరు సాక్ష్యాలతో సంతకం పెట్టించి ఇవ్వాలి.
@ ఎలక్షన్ ఖర్చు నిర్వహణ చేస్తానని డిక్లరేషన్ ఇవ్వాలి.
@ ఏ పార్టీ తరుపున పోటీ చేస్తున్నారో నామినేషన్ పత్రంలో ముందే తెలపాలి.
@ నామినేషన్‌కు లోపలికి ముగ్గురే వెళ్ళాలి
Similar News
News October 10, 2025
ఉమ్మడి విశాఖ జిల్లా హాకీ పోటీలకు 17 మంది బాలికలు ఎంపిక

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నక్కపల్లిలో జరుగుతున్న ఉమ్మడి విశాఖ జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో 17 మంది బాలికలు ఎంపికయ్యారు. వీరు ఉమ్మడి విశాఖ జిల్లా తరపున ఆడనున్నట్లు ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి నాయుడు గురువారం తెలిపారు. జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైన వారిలో జయశ్రీ, లవ కుమారి, శాంతి, రాణి, లక్ష్మి, శ్రావణ దేవి, జాహ్నవి, దుర్గ, కనకమహాలక్ష్మి, సౌజన్య, పావని, టోనేశ్వరి తదితరులు ఉన్నారు.
News October 10, 2025
ఏలూరు: నర్సింగ్ జాబ్స్‌కు దరఖాస్తుల ఆహ్వానం

AP స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా కత్తర్ (దోహా)లో హోమ్ కేర్ నర్సింగ్ జాబ్స్ కొరకు మైనారిటీ యువతీ, యువకులకు నుంచి దరఖాస్తు కోరుతున్నామని జిల్లా మైనారిటీ ఆర్థిక సంస్థ కార్యనిర్వాహన సంచాలకులు ప్రభాకర్ రావు తెలిపారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. BSC/GNM నర్సింగ్ చదివి అనుభవం కలిగిన 21-40 సం.లు లోపు వారు అర్హులు అన్నారు. ఈ నెల 12లోగా దరఖాస్తు అందించాలన్నారు.08812-242463 సంప్రదించాలన్నారు.
News October 10, 2025
నేటి నుంచి NTR వైద్య సేవలు బంద్!

AP: రాష్ట్రంలో నేటి నుంచి NTR వైద్య సేవలు మరోసారి నిలిచిపోనున్నాయి. ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడంతో నిలిపివేస్తున్నట్లు నెట్‌వర్క్ ఆస్పత్రులు నిన్ననే ప్రకటించాయి. రూ.2,700 కోట్లు రావాలని, ప్రజాప్రతినిధులను కలిసినా ఫలితం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించాయి. వైద్య సేవలు నిలిపేయొద్దని, సమస్య పరిష్కరిస్తామని మంత్రి సత్యకుమార్ కోరినప్పటికీ నెట్‌వర్క్ ఆస్పత్రులు వెనక్కి తగ్గలేదు.