News September 9, 2025

ఆదిలాబాద్ నుంచి నిర్మల్ జిల్లాకు జే.నర్సయ్య

image

సహకార శాఖలో ఆదిలాబాద్ జిల్లా డిప్యూటీ రిజిస్టర్, ఆడిట్ అధికారిగా పనిచేస్తున్న జే.నర్సయ్యకు స్పెషల్ క్యాడర్ డిప్యూటీ రిజిస్టర్‌గా పదోన్నతి లభించింది. ఇందులో భాగంగా నిర్మల్ జిల్లా సహకార అధికారిగా ఆయన నియమితులయ్యారు. టీఎన్జీవోస్ యూనియన్ ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు ఆయనను కార్యాలయ సిబ్బందితో కలిసి శాలువాతో సత్కరించి, పూలబొకే అందజేసి అభినందనలు తెలిపారు.

Similar News

News March 4, 2026

జనసేన ఆఫీసుపై దాడి.. శ్రీకాకుళం జిల్లా యువకుడి అరెస్ట్

image

మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇటీవల 2 కార్లను ధ్వంసం చేయడంతో పాటు భద్రతా సిబ్బందిపై దాడిచేసిన వ్యక్తిని మంగళవారం రిమాండ్‌కి పంపినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. పార్టీ కార్యాలయ భద్రతా సిబ్బంది RI పెంటారావు ఫిర్యాదు మేరకు కంచిలి మండలం బెలగాంకు చెందిన నీలాద్రిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి మంగళగిరి కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి నిందితుడికి 14 రోజులు రిమాండ్ విధించారు.

News March 4, 2026

తూ.గో: ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. నమ్మించి గర్భవతిని చేశాడు..!

image

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువతిని ప్రేమ పేరుతో నమ్మించి, శారీరకంగా దగ్గరై గర్భవతిని చేసిన గ్రామ సచివాలయ ఉద్యోగిని రాయవరం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకోమని కోరగా నిందితుడు నిరాకరించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు SI సురేశ్ తెలిపారు. సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమయ్యే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

News March 4, 2026

నెల్లూరు: డ్రగ్స్ వద్దు బ్రో అంటూ..!

image

నెల్లూరు జిల్లాను “డ్రగ్ ఫ్రీ” జిల్లాగా మార్చే లక్ష్యంతో ఎస్పీ డా.అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 988 ఈగల్ క్లబ్స్, 24 డ్రోన్లతో నిఘా పెంచారు. “డ్రగ్స్ వద్దు బ్రో” నినాదంతో విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తున్నారు.