News April 18, 2024

ఆదిలాబాద్: నేటి నుంచే షురూ

image

పార్లమెంట్‌ ఎన్నికల సమరానికి సమయం ఆసన్నమైంది. ఏడు శాసనసభ స్థానాలతో విస్తరించిన ADB పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో ఫిబ్రవరి 8న విడుదల ఓటరు జాబితా ప్రకారం మొత్తం 16,44,715 మంది ఓటర్లున్నారు. ఇందులో 2,57,248 మంది ఓటర్లతో నిర్మల్‌ మొదటిస్థానంలో ఉంటే 2,10,915 ఓటర్లతో బోథ్‌ నియోజకవర్గం చివరిస్థానంలో ఉంది. ADB కలెక్టరేట్‌ ఆవరణలో నేటి నుంచి ప్రారంభం కానున్న నామపత్రాల స్వీకరణ ఈ నెల 25తో ముగియనుంది.

Similar News

News April 23, 2025

ADB: ఈనెల 28 నుంచి కేయూ సెమిస్టర్ పరీక్షలు

image

వరంగల్ కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ 2వ, 4వ, 6వ సెమిస్టర్, డిగ్రీ(బ్యాక్ లాగ్) మొదటి, మూడో, ఐదవ సెమిస్టర్ పరీక్షలను ఈనెల 28 నుంచి నిర్వహించనున్నారు. ఏప్రిల్ 21 నుంచి పరీక్షలు జరగాల్సి ఉండగా కొన్ని కళాశాలలు పరీక్షా ఫీజులు, నామినల్ రోల్స్ అందించని కారణాలతో వాయిదా పడినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రాజేందర్ తెలిపారు. సవరించిన పరీక్షా టైం టేబుల్, ఇతర వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్లో చూడవచ్చన్నారు.

News April 23, 2025

భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రాజు

image

భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆదిలాబాద్‌కు చెందిన గాజంగుల రాజు 3వ సారి ఎన్నికయ్యారు. HYDలో మంగళవారం జరిగిన సంఘం మహాసభలో రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గాజంగుల రాజు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, కీర్తి రమణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎన్నుకున్నారు. దీంతో సంఘం నాయకులు వారి అభినందించారు.

News April 23, 2025

ADB: ఇంటర్‌ ఫలితాల్లో సత్తా చాటిన ప్రణయ్

image

ఇంటర్ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సదాలి ప్రణయ్ సత్తా చాటాడు. ద్వితీయ సంవత్సరం MPC విభాగంలో 1000కి 991 మార్కులు సాధించి ఔరా అనిపించాడు. భోరజ్ మండలం గిమ్మ గ్రామానికి సదాలి బాపన్న-గంగమ్మ దంపతుల కుమారుడు ప్రణయ్. ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చడంతో యువకుడిని గ్రామస్థులు అభినందించారు.

error: Content is protected !!