News April 8, 2024

ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో మహిళ ఓటర్లే అధికం

image

ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో మహిళ ఓటర్లే అధికంగా ఉన్నారు. పార్లమెంట్ పరిధిలో 24,మార్చి 2024 నాటికి మొత్తం ఓటర్లు 16,44,715 మంది ఓటర్లు ఉన్నారు. అందులో మహిళలు 8,42,575, పురుషులు 8,42,054 మంది ఉన్నారు. పురుషులకంటే 521 మహిళలే అధికంగా ఉన్నారు. జిల్లాలో మహిళ ఓటర్లే ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించనున్నారు.

Similar News

News October 9, 2024

సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు: ADB కలెక్టర్

image

సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, ఫేక్ మేసేజ్‌లు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు తీసి గ్రూపుల్లో పోస్టు చేసిన, ఫార్వర్డ్ చేసిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాస్తవాలు తెలుసుకొని, ఒకటికి రెండుసార్లు వార్త సరైనదా, కాదా పరిశీలించుకుని ప్రచురించాలన్నారు.

News October 8, 2024

ADB, ASF, MNCL జిల్లాలను ఆ జాబితాలో చేర్చండి: CM రేవంత్

image

ఢిల్లీలో జరిగిన వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సీఎం సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం.. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. వామపక్ష, తీవ్రవాద ప్రభావిత (ఎల్‌డబ్ల్యూఈ) జిల్లాల జాబితాలో నుంచి తొలగించిన ఆదిలాబాద్, మంచిర్యాల,ఆసిఫాబాద్ జిల్లాలను తిరిగి ఆ జాబితాలో చేర్చాలని అమిత్ షా ను రేవంత్ రెడ్డి కోరారు.

News October 8, 2024

తాండూర్: స్నేహితులతో క్రికెట్ ఆడుతూ వ్యక్తి మృతి

image

క్రికెట్ ఆడుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన తాండూర్ మండలంలో చోటు చేసుకుంది. విద్యాభారతి పాఠశాలలో విద్యాభారతి బలగం పేరిట పూర్వ విద్యార్థులు క్రికెట్ ఆడుతున్నారు. ఇందులో భాగంగా రాచకొండ లక్ష్మీనారాయణ క్రికెట్ ఆడుతూ అస్వస్థతకు గురికావడంతో ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అప్పటి వరకు తమతో ఉత్సాహంగా క్రికెట్ ఆడిన మిత్రుడి మరణంతో తోటి స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు.