News April 14, 2025
ఆదిలాబాద్: పిల్లలపై నిరంతరం అప్రమత్తంగా ఉండండి

మరికొద్ది రోజుల్లో విద్యార్థులకు 2 నెలల వేసవి సెలవులు రానున్నాయి. దీంతో పిల్లలు నదులు, చెరువుల్లో ఈత కొట్టడానికి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకునే అవకాశం ఉంది. కనుక తల్లిదండ్రులు పిల్లల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. వారిపై ఎప్పటికీ అప్పుడు నిఘా ఉంచాలి. అలాగే ఎండలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలు బయటకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
Similar News
News April 15, 2025
ADB: నేటి నుంచి యూడైస్ ప్లస్ సర్వే

జిల్లావ్యాప్తంగా నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో యూడైస్ ప్లస్ సర్వే నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. డైట్, బీఎడ్ ఛాత్రోపాధ్యాయుల ద్వారా క్షేత్రస్థాయి విద్యార్థుల నమోదు, హాజరు సంఖ్య, మౌలిక వసతుల వంటి అంశాలపై 585 పాఠశాలల్లో సర్వే చేయనున్నారు. జిల్లాకు సర్వే చేయడానికి 59 మందిని ఎంపిక చేసి ఇదివరకే శిక్షణను ఇచ్చారు. సర్వే ద్వారా అవసరమైన వసతులు కల్పించనున్నారు.
News April 15, 2025
ADB: కత్తులతో పోస్టులు పెడుతున్నారా.. జాగ్తత్త

సోషల్ మీడియాలో ఫాలోవర్ల కోసమో.. హైప్ కోసం కత్తులు పట్టుకొని వీడియోలు పెడుతున్నారా.. జాగ్రత్త. ఇలాంటి వాటిపై ADB పోలీసులు దృష్టి సారించారు. ఎంతటి వారైనా తమ నుంచి తప్పించుకోలేరని హెచ్చరిస్తున్నారు. బైక్‌పై నోట్లో కత్తి పెట్టుకొని వీడియోలు పోస్ట్ చేసిన బంగారిగూడకు చెందిన సలీంపై ఇప్పటికే కేసుపెట్టారు. ఇలాగే వ్యవహరించిన పలువురిపై చర్యలు తీసుకున్నారు. ప్రజలను ఇబ్బందిపెడితే ఉపేక్షించేది లేదంటున్నారు.
News April 14, 2025
కోటపల్లి: నవదంపతుల సూసైడ్

పెళ్లైన 6 నెలలకే దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. కోటపల్లి (M) దేవులవాడకు చెందిన సృజన(30) లక్షెట్టిపేటలో డిగ్రీ చదువుతోంది. కులాలు వేరే కావడంతో పెద్దలను ఎదురించి సీనియర్ విష్ణువర్ధన్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఈ క్రమంలో విష్ణువర్ధన్ మార్చి 24న గోదావరిలో దూకి సూసైడ్ చేసుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన సృజన ఇంట్లోనే ఉరేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కుబుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.