News March 15, 2025
ఆదిలాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో AI బోధన

ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రైమరీ పాఠశాలల్లో శనివారం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) బోధన ప్రారంభించనున్నట్లు జిల్లా పాలనాధికారి రాజర్షి షా తెలిపారు. తలమడుగు మండలం దేవాపూర్ ప్రైమరీ స్కూల్ తెలుగు, ఉర్దూ మీడియం, కోడద్ ప్రైమరీ స్కూల్, ఆదిలాబాద్ అర్బనులోని తాటిగూడ ప్రైమరీ పాఠశాలల్లో ఈ AI ప్రోగ్రాం ఉండనుందని వెల్లడించారు.
Similar News
News March 17, 2025
ఆదిలాబాద్: నేడు, రేపు వడగాలులు

ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఆదివారం 38 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా సోమవారం, మంగళవారం రెండు రోజులు ఉమ్మడి జిల్లాలో వడగాలులు వీచే ప్రమాదం ఉందని పేర్కొంది. కాగా చిన్నారులు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మధ్యాహ్నం వేళ బయటకు రావద్దని సూచించింది.
News March 17, 2025
ADB: అగ్నివీర్ రిక్రూట్మెంట్కు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం

‘అగ్నిపథ్’ స్కీం క్రింద అగ్నివీర్ రిక్రూట్మెంట్ RTG 2025-26 కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ www.joinindianarmy.nic.in అధికారిక వెబ్ సైట్లో ప్రారంభమైందని ఆదిలాబాద్ డీఐఈఓ జాదవ్ గణేశ్ తెలిపారు. అగ్నివీర్లోని వివిధ కేటగిరీల కింద నియామకాలు జరుగుతున్నాయన్నారు. ఆసక్తి గలవారు ఏప్రిల్ 10 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News March 17, 2025
ఆదిలాబాద్: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన ఇచ్చోడలో చోటుచేసుకుంది. ఎస్ఐ తిరుపతి వివరాల ప్రకారం.. ఇచ్చోడలోని శివాజీ చౌక్ వద్ద గల పాన్ షాప్ వద్ద సయ్యద్ రావుఫ్ (38) మృతి చెంది పడిఉన్నాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతుడి బావ మరిది ఆసిఫ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.