News August 7, 2024
ఆదిలాబాద్: ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీరు అందిస్తాం: డిప్యూటీ సీఎం

ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం పిప్పిరి గ్రామంలో బుధవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలు సంక్షేమ పథకాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లా అందమైన జిల్లా అని, జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీరు అందిస్తామన్నారు. గతంలో పిప్పిరి గ్రామం నుండి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేశానని గుర్తు చేశారు. పాదయాత్రలో ప్రజల సమస్యలను ఎన్నో చూశానన్నారు.
Similar News
News February 17, 2026
రేపు సెలవు కానీ పరీక్షలు యథాతథం: ADB కలెక్టర్

సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 18న జిల్లాలో స్థానిక సెలవు ప్రకటించబడినప్పటికీ, అదే రోజున నిర్వహించాల్సిన ఎస్సెస్సీ ప్రీ–ఫైనల్ పరీక్షలు యథావిధిగా నిర్వహిస్తామని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పరీక్షలు వాయిదా వేయబడవన్నారు. జిల్లాలోని MEOలు, HMలు, SOలు, TGMS ప్రిన్సిపల్స్ పరీక్షలు నిర్ణీత టైమ్‌టేబుల్ ప్రకారం నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News February 17, 2026
కాగజ్‌నగర్‌లో SP అఖిల్ తనిఖీలు

కాగజ్‌నగర్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయాన్ని ఆదిలాబాద్ SP అఖిల్ మహాజన్ తనిఖీ చేసి బందోబస్తును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పట్టణంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. కాగజ్‌నగర్ మున్సిపల్ కార్యాలయం, ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు ఎస్పీ అఖిల్ తెలిపారు.
News February 16, 2026
BREAKING: కాంగ్రెస్‌లోకి ADB మున్సిపల్ ఛైర్‌పర్సన్

ప్రజాస్వామ్యంలో అభివృద్ధి కోసం కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకోవడం సరైన దేనని ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల పార్లమెంట్ ఇన్‌ఛార్జ్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైన బండారి అనూష సోమవారం నిజామాబాద్‌లోని ఆయన నివాసంలో కాంగ్రెస్‌లో చేరారు. వారిని అభినందించి శాలువాలతో సత్కరించారు. అనంతరం కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు.


