News August 13, 2024

ఆదిలాబాద్: బంద్ ప్రశాంతం

image

బంగ్లాదేశ్‌లో హిందువులపై, వారి వ్యాపారాలపై దాడులకు నిరసనగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ పిలుపునిచ్చిన ఆదిలాబాద్ బంద్ ప్రశాంతంగా జరిగింది. వ్యాపారులు స్వచ్ఛందంగా తమ దుకాణాలను మూసి ఉంచారు. హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా వ్యాపారస్థులు బంద్‌లో పాల్గొని సంఘీభావం తెలిపారు. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు.

Similar News

News February 18, 2026

రాష్ట్రస్థాయి క్రీడల్లో ఆదిలాబాద్‌ చిన్నారుల ప్రభంజనం

image

రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా నిర్వహించిన రాష్ట్రస్థాయి ప్రత్యేక అవసరాలు గల పిల్లల ఆటల పోటీల్లో ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి, ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకోవడం జిల్లాకు గర్వకారణమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఈ పోటీల కోసం జిల్లా నుంచి 26 మంది విద్యార్థులు హైదరాబాద్‌కు వెళ్లగా, వారు పాల్గొన్న దాదాపు అన్ని విభాగాల్లోనూ సత్తా చాటారు. వారిని కలెక్టర్ అభినందించారు.

News February 18, 2026

ADB: బ్రిడ్జి కోర్సు ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు

image

ఐటీఐ 2 సంవత్సరాల కోర్సులో పాసైన విద్యార్థుల నుంచి పాలిటెక్నిక్ రెండో సంవత్సరంలోకి ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆదిలాబాద్ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ పీ.శ్రీనివాస్ తెలిపారు. ఫిబ్రవరి 21లోపు సర్టిఫికెట్‌లతో కళాశాలలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. 60% ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. బ్రిడ్జి కోర్సు ప్రవేశ పరీక్ష మార్చి 12న ఉంటుందన్నారు.

News February 18, 2026

శివాజీ జయంతి ర్యాలీలకు అనుమతులు తప్పనిసరి: ADB SP

image

శివాజీ జయంతి సందర్భంగా గురువారం జిల్లా వ్యాప్తంగా జరిగే ర్యాలీలు, సభలకు ముందస్తు పోలీసుల అనుమతులు తప్పనిసరి అని SP అఖిల్ మహాజన్ తెలిపారు. 30 పోలీస్ ACT అమలులో ఉన్నందున అనుమతులు లేకుండా బైక్ ర్యాలీలు, డీజేలు పెట్టవద్దని.. శాంతియుతంగా నిర్వహించాలని సూచించారు. ర్యాలీలలో కత్తులు, తల్వార్ల ప్రదర్శనలు, ఇతర మతాలను కించపరిచే నినాదాలు చేస్తూ శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.