News December 20, 2025
ఆదిలాబాద్: బాలికపై అత్యాచారం.. వ్యక్తిపై పోక్సో కేసు

బాలికను నమ్మించి, అపహరించి అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదైంది. ఆదిలాబాద్‌లోని ఒక కాలనీకి చెందిన బాలికను నిందితుడు కిడ్నాప్ చేసి వివిధ ప్రాంతాలకు తిప్పుతూ పలుమార్లు అత్యాచారం చేశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో తొలుత మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు, సాంకేతిక ఆధారాలతో నిందితుడిని పట్టుకున్నారు. బాలికను రక్షించి, నిందితుడిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ జీవన్‌రెడ్డి వెల్లడించారు.
Similar News
News December 22, 2025
సంగారెడ్డి: రేపటి నుంచి పాఠశాలలకు క్రిస్మస్ సెలవులు

సంగారెడ్డి జిల్లాలోని మిషనరీ పాఠశాలలకు రేపటి నుంచి ఈనెల 27 వరకు పాఠశాల విద్యాశాఖ క్రిస్మస్ సెలవులు ప్రకటించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సోమవారం తెలిపారు. తిరిగి పాఠశాలలు 28న పునఃప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని మిషనరీ పాఠశాలల యాజమాన్యాలు గమనించాలని సూచించారు.
News December 22, 2025
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News December 22, 2025
పొద్దుతిరుగుడు నాటిన తర్వాత కలుపు నివారణ

పొద్దుతిరుగుడు విత్తిన 24-48 గంటల్లోపు ఎకరాకు 200 లీటర్ల నీటిలో 1 లీటర్ పెండిమిథాలిన్30% E.C రసాయనాన్ని కలిపి పిచికారీ చేయాలి. దీని వల్ల 20 రోజుల వరకు కలుపును నివారించవచ్చు. పంట 30-40 రోజుల దశలో అంతరకృషి చేయాలి. ఇది సాధ్యం కాకపోతే గడ్డి జాతి కలుపు నివారణకు ఎకరాకు 400ml క్విజాలొఫాప్ ఇథైల్ 5% ఇ.సి. లేదా ప్రొపాక్విజాఫాప్ 10% ఇ.సి. 250mlను 200 లీటర్ల నీటిలో కలిపి కలుపు 2-4 ఆకుల దశలో పిచికారీ చేయాలి.


