News October 28, 2025
ఆదిలాబాద్: బాలుడి కిడ్నాప్‌కు యత్నం.. కేసు నమోదు

బాలుడి కిడ్నాప్ యత్నం కేసును నమోదు చేశామని వన్ టౌన్ సీఐ సునీల్ తెలిపారు. యూపీలోని ఫైజాబాద్‌కు చెందిన రాహుల్ అనే యువకుడు ఆదిలాబాద్ ఖానాపూర్ కాలనీలో ఒక బాలుడిని అపహరించే యత్నం చేస్తుండగా కాలనీకి చెందిన షేక్ హసన్‌తోపాటు కొందరు పట్టుకున్నారని పేర్కొన్నారు. అనంతరం నిందితుడిని పోలీసులకు అప్పగించారన్నారు. నిందితుడు తన పేరును సలీం, సల్మాన్ పేర్కొనగా ఆధార్ కార్డు పరిశీలించగా రాహుల్‌గా గుర్తించామన్నారు.
Similar News
News October 29, 2025
4,155 మందికి పునరావాసం: కలెక్టర్

మొంథా తుఫాన్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 37 పునరావాస కేంద్రాల్లో మంగళవారం మధ్యాహ్నం నాటికి 4,155 మంది బాధితులకు భోజన సౌకర్యం కల్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 3,581 ఎకరాల వరి పొలాల్లో వర్షపు నీరు చేరిందని, జిల్లాలో తుఫాను కారణంగా 10 గ్రామాలు ముంపునకు గురి కాగలదని గుర్తించడం జరిగిందని ఆమె వెల్లడించారు.
News October 29, 2025
1,937 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు: మంత్రి నాదెండ్ల

ఏలూరు జిల్లాలో 54 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసి, తుఫాను బాధితులైన 1,937 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రతీ కేంద్రంలో భోజన, వసతి, వైద్య సదుపాయాలు కల్పించామన్నారు. జిల్లా వ్యాప్తంగా 148 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని, 318 మంది గర్భిణులను పీహెచ్‌సీల్లోకి తరలించామని ఆయన మంగళవారం రాత్రి పత్రికా ప్రకటనలో వెల్లడించారు.
News October 29, 2025
కడప జిల్లాలోని కాలేజీలకు కూడా ఇవాళ సెలవు

కడప జిల్లాపై తుఫాన్ ప్రభావం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నిన్న జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు బుధవారం సైతం సెలవు ఇస్తున్నామని డీఈవో శంషుద్దీన్ ఓ ప్రకటనలో తెలిపిన విషయం తెలిసిందే. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకుని ఇవాళ కాలేజీలకు కూడా సెలవులు ప్రకటిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


