News September 7, 2025
ఆదిలాబాద్: బెట్టింగ్‌తో జీవితం నాశనం చేసుకోవద్దు..!

ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి చెందిన ఓ బ్యాంకు క్యాషియర్ ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసై దొంగగా మారి కటకటాల పాలైన సంగతి తెలిసిందే. ఇలా ఇప్పటికే పలువురు తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. ఈనెల 9న ఆసియా కప్ టీ 20 క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్న నేపథ్యంలో యువత బెట్టింగ్ జోలికి వెళ్లొద్దని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకసారి బెట్టింగ్ అలవాటైతే దానిని వదిలించుకోవడం చాలా కష్టమని పేర్కొంటున్నారు.
Similar News
News September 8, 2025
HYD: ఈ విషయంలో ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తాం: కవిత

కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, బీసీలను మోసం చేసిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. బీసీలకు 42% శాతం రిజర్వేషన్ల కోసం బీసీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. రిజర్వేషన్లు కల్పించే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించొద్దని, ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. బీసీ సంఘాలను కలుపుకొని ముందుకు సాగనున్నట్లు తెలిపారు.
News September 8, 2025
మెదక్: ప్రజావాణి వినతులు స్వీకరించిన ఎస్పీ

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా ఎస్పీ డీవీ.శ్రీనివాస రావు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కార్యాలయానికి తరలివచ్చి తమ సమస్యలు నేరుగా ఎస్పీ దృష్టికి తెచ్చారు. పరిష్కారం చేసే వాటిని పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి నేరుగా రావాలన్నారు.