News February 12, 2026
ఆదిలాబాద్: బ్యాలెట్ బాక్స్‌లోనే భవితవ్యం

ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. పోలింగ్ ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకోగా, అభ్యర్థుల్లో మాత్రం ఉత్కంఠ పెరిగింది. ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నా, ఓటింగ్ సరళిపై స్పష్టమైన అంచనాకు రాలేక లోలోన ఆందోళన చెందుతున్నారు. అందరి దృష్టి ఇప్పుడు కౌంటింగ్ కేంద్రాల్లో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సులపైనే ఉంది.
Similar News
News February 12, 2026
విశాఖ: ఫ్లైట్స్ షెడ్యూల్స్‌లో మార్పులు చూసుకున్నారా..!

విశాఖలో ఫిబ్రవరి 15-19 వరకు అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ, మిలాన్-2026 నౌకాదళ విన్యాసాల నేపథ్యంలో విమానాశ్రయంలో షెడ్యూల్‌ను ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సవరించింది. రోజూ ఉదయం 10.45-12.30, సాయంత్రం 4-5.30, 6.30-7.30 మధ్య వైమానిక మార్గం తాత్కాలికంగా మూసివేయనున్నారు. 16 విమానాల రాకపోకలు మారాయి. చెన్నై-విశాఖ-చెన్నై 6E581, 6E881 సర్వీసులు రద్దయ్యాయి. ప్రయాణికులు గమనించాలని అధికారులు సూచించారు.
News February 12, 2026
5 మున్సిపాలిటీల్లో కట్టుదిట్టమైన బందోబస్తు: ఖమ్మం కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. 5 మున్సిపాలిటీల కౌంటింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఎంట్రెన్స్, ఎగ్జిట్‌లు, వెబ్‌కాస్టింగ్, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్‌తో లెక్కింపు ప్రారంభమవుతుందని చెప్పారు. ఏదులాపురం(31), మధిర(22), సత్తుపల్లి(23), వైరా, కల్లూరు (20) వార్డులకు 2 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుందన్నారు.
News February 12, 2026
అందుకే BRS అధికారం కోల్పోయింది: కవిత

TG: ప్రజాస్వామ్య విలువలను కాలరాయడం వల్లే BRS అధికారం కోల్పోయిందని కవిత అన్నారు. ‘ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చనందుకే KCR అధికారం కోల్పోయారు. రేవంత్ పట్టించుకోకపోతే ఆయననూ ప్రజలు వదిలిపెట్టరు’ అని హెచ్చరించారు. రాజకీయ పార్టీ పెడతానంటే తనపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడానికి తెలంగాణ పదం ఉండేలా పార్టీ పెడతానని ఉద్యమకారుల ఆత్మగౌరవ సభలో వ్యాఖ్యానించారు.


