News March 2, 2025

ఆదిలాబాద్: భార్య మందలించిందని భర్త SUICIDE

image

భార్య మందలించిందని ఓ భర్త పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు 2 టౌన్ ఏఎస్ఐ ముకుంద్ రావు తెలిపారు. మహారాష్ట్ర కిన్వాట్ తాలూకా దైహిలీకు చెందిన నూకల్వర్ ఓం ప్రకాశ్(35) మద్యానికి బానిస అయ్యాడు. ముగ్గురు పిల్లలు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుందని భార్య మందలించింది. దీంతో శనివారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు రిమ్స్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Similar News

News March 3, 2025

ఆదిలాబాద్: కౌంటింగ్ షురూ… అభ్యర్థుల్లో ఉత్కంఠ

image

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కీల‌క ఘ‌ట్ట‌మైన పోలింగ్ జిల్లాలో ఇటీవ‌ల ప్ర‌శాంతంగా ముగిసింది. అయితే సోమవారం ఇందుకు సంబంధించిన ఫ‌లితాల ప్రక్రియ ప్రారంభమైన నేప‌థ్యంలో పోటీచేసిన అభ్య‌ర్థుల‌లో ఉత్కంఠ రేపుతోంది. ఎవ‌రి భవిత‌వ్యం ఎలా ఉండ‌బోతుందో తేలిపోనుంది. మొత్తం14935 మందికి గాను 10,396 మంది ఓటు వేయ‌గా 69.61 శాతం పోలింగ్ న‌మోదైంది. అలాగే టీచ‌ర్స్ 1,593 మంది ఉండ‌గా 1,478 మంది త‌మ ఓటుహక్కు వినియోగించుకున్నారు.

News March 3, 2025

నేరడిగొండ: WOW.. ఇక్కడి ఆడపడుచులు GREAT

image

నేరడిగొండ మండలం మంగల్ మోట (తర్నం) గ్రామానికి చెందిన ఆడపడుచులు పేదింటి యువతి పెళ్లికి ఆర్థిక సాయం చేసి అండగా నిలిచారు. ఆదివాసీ గ్రామాల్లో కట్న కానుకలను నిషేధిస్తూ ఆదివాసీలు తీర్మానం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఎలాంటి కట్న కానుకలు లేకపోవటంతో గ్రామంలో 60 కుటుంబాల ఆడపడుచులు కలిసి వారికి తోచినంత పొదుపు చేసుకొని రూ.12,342 ఆర్థిక సాయాన్ని అందజేశారు.

News March 3, 2025

ADB: రైలు ఎక్కబోయి జారిపడి వ్యక్తికి గాయాలు

image

కదులుతున్న రైలు ఎక్కబోయి వ్యక్తి జారి పడి గాయాలపాలైన ఘటన ఆదిలాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన కుందన్ పవార్ హైదరాబాద్‌కు వెళుతూ.. ఆదిలాబాద్ స్టేషన్‌లో వాటర్ బాటిల్ కోసం దిగాడు. అనంతరం కృష్ణా ఎక్స్‌ప్రెస్ కదిలేటప్పుడు పరుగెత్తుతూ వెళ్లి ఎక్కేటప్పుడు జారి ప్లాట్‌ఫామ్‌పై పడిపోవడంతో అతని చెయ్యికి గాయాలయ్యాయి. 108 సిబ్బంది చికిత్స అందించి రిమ్స్‌కు తరలించారు.

error: Content is protected !!