News July 22, 2024

ఆదిలాబాద్: మరో మూడు రోజులు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

image

రాగల మూడు రోజుల పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉరుములు మెరుపులతోపాటు గంటకు 30కి.మీ నుంచి 40కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల వారు, నది తీరాన ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
>>>TAKE CARE

Similar News

News February 20, 2026

చైల్డ్ పోర్నోగ్రఫీ.. ఆదిలాబాద్ జిల్లాలో 5 కేసులు: ఎస్పీ

image

చైల్డ్ పోర్న్ వీడియోలు చూడటం, డౌన్‌లోడ్ చేయటం, సోషల్ మీడియాలో షేర్ చేయటం చట్టరీత్యా తీవ్రమైన నేరమని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 5 కేసులు నమోదు అయ్యాయన్నారు. హైదరాబాద్ “చైల్డ్ టిప్ లైన్” పర్యవేక్షణ కొనసాగుతోందని పేర్కొన్నారు.

News February 20, 2026

ఆదిలాబాద్: ఈనెల 24న జాబ్ మేళా

image

ఆదిలాబాద జిల్లాలోని నిరుద్యోగ యువతి, యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఆదిలాబాద్ ప్రభుత్వ ITI కళాశాలలో ఈనెల 24న మంగళవారం జాబ్ మెళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పన అధికారి మిల్కా తెలిపారు. ఏదైనా డిగ్రీ చేసి 18 నుంచి 35 లోపు వారు అర్హులన్నారు. ఎంపికైన వారికి ఆకర్షనీయమైన జీతంతో పాటు ఇతర అలవెన్సులు ఇవ్వనున్నట్లు తెలిపారు.

News February 20, 2026

ఆదిలాబాద్: పది పరీక్షలకు 52 పరీక్ష కేంద్రాలు

image

ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది 10,888 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నట్లు డీఈఓ రాజేశ్వర్ వెల్లడించారు. వీరిలో 5,443 మంది బాలురు, 5,445 మంది బాలికలు ఉన్నారు. మొత్తం 52 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, పర్యవేక్షణ కోసం 52 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 52 మంది డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, 13 మంది కస్టోడియన్లను నియమించినట్లు ఆయన పేర్కొన్నారు.