News November 18, 2025
ఆదిలాబాద్: మళ్లీ ఆశల చిగురింత

స్థానిక పోరుపై ఆశలు వదులుకున్న గ్రామాల్లో ఎన్నికల నిర్వహణపై రాష్ట్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఉమ్మడి ADB జిల్లాలో సందడి మొదలైంది. ఇకేంముంది మళ్లీ చర్చలు మొదలయ్యాయి. రిజర్వేషన్లు అనుకూలంగా రాకపోవడంతో నిరాశ చెందిన ఆశావాహుల్లో ఆశలు చిగురించాయి. రిజర్వేషన్లు మారనున్న నేపథ్యంలో పోటీ చేయడానికి ఆశావహులు సిద్ధం అవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 1514 గ్రామ పంచాయతీలు, 581 MPTC, 69 ZPTC స్థానాలున్నాయి.
Similar News
News November 18, 2025
డిజిటల్ అరెస్ట్ వ్యవస్థ లేదు: SP జానకి షర్మిల

చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనే వ్యవస్థ లేదని SP జానకి షర్మిల అన్నారు. వీడియో కాల్, వాట్సాప్, ఫోన్ ద్వారా ఎవరైనా “మీరు కేసులో ఉన్నారు” “మీరు అరెస్టులో ఉన్నారు” అని బెదిరిస్తే ప్రజలు నమ్మవద్దన్నారు. వ్యక్తిగత, బ్యాంక్, OTP, UPI, ఆధార్, వివరాలు తెలపవద్దన్నారు. డబ్బులు అడిగితే వెంటనే కాల్ కట్ చేయాలని, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు లేదా https://www.cybercrime.gov ఫిర్యాదు చేయాలని సూచించారు.

BIG BREAKING: లొంగుబాటులో మావో చీఫ్

మావోయిస్టులకు సంబంధించి Way2Newsకు కీలక సమాచారం అందింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ పోలీసుల అదుపులో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. విజయవాడలో అరెస్టైన మావోయిస్టుల్లో 9 మంది దేవ్ జీ సెక్యూరిటీ అని AP ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా వెల్లడించారు. దీంతో తన గార్డులతో పాటు దేవ్ జీ లొంగిపోయి ఉంటారని తెలుస్తోంది. దీనిపై కొద్ది గంటల్లో అధికార వర్గాల నుంచి ప్రకటన రావచ్చు.