News February 2, 2026
ఆదిలాబాద్: మీడియా సెంటర్ సందర్శించిన ఎన్నికల పరిశీలకులు

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ పౌరసంబంధాల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ను ఎన్నికల సాధారణ పరిశీలకులు హనుమంతు నాయక్ సందర్శించారు. DPRO విష్ణువర్ధన్‌ను అడిగి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికల నిబంధనలకు లోబడి వార్తలు ప్రచురించాలని సూచించారు. మీడియా పాత్ర కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో ఈడీఎం రవి, మెప్మా పీడీ రాజు, సిబ్బంది ఉన్నారు.
Similar News
News February 12, 2026
ఆదిలాబాద్: కౌంటింగ్ కేంద్రాలకు వచ్చే వారికి సూచనలు

ఆదిలాబాద్‌లో రేపు జరగనున్న మున్సిపల్ ఓట్ల లెక్కింపుకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచల భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. టీటీడీసీ పరిసరాల్లో 163 BNSS (144 సెక్షన్) అమలులో ఉంటుందన్నారు. విజయోత్సవ ర్యాలీలు, టపాకాయలు, డీజేలకు అనుమతి లేదన్నారు. ఏజెంట్లు, అభ్యర్థులు సెల్‌ఫోన్లు, ఇంకు పెన్నులు తీసుకురావద్దని సూచించారు.
News February 12, 2026
ఆదిలాబాద్: కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనలకు లోబడి నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఆదిలాబాద్ టీటీడీసీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని గురువారం ఆయన ఎన్నికల సాధారణ పరిశీలకుడు హనుమంత్ నాయక్‌తో కలిసి పరిశీలించారు. కౌంటింగ్ హాళ్లు, భద్రతా ఏర్పాట్లు, బారికేడింగ్, వెలుతురు తదితర సదుపాయాలను స్వయంగా తనిఖీ చేసి సూచనలు చేశారు.
News February 12, 2026
ఆదిలాబాద్ పీఠాన్ని హస్త గతం చేసుకుంటాం: డీసీసీ అధ్యక్షుడు

ఆదిలాబాద్ మున్సిపల్ పీఠాన్ని తప్పకుండా కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నరేష్ జాదవ్ అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ అభ్యర్థులతో గురువారం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కంది శ్రీనివాస రెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు. వార్డుల వారీగా ఓటింగ్ జరిగిన తీరు గురించి చర్చించారు. అనంతరం క్యాంప్‌నకు తరలించారు.


