News May 10, 2024

ఆదిలాబాద్ : మీరు ఓటేశారా..? నేడే LAST మరీ..!

image

ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులు, పాత్రికేయులకు కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ ద్వారా కల్పించిన ఓటింగ్ సదుపాయం నేటితో ముగియనుందని అధికారులు తెలిపారు. ఈనెల 3నుంచి 8వరకు అవకాశం ఇవ్వగా మరో 2 రోజులు పోస్టల్ బ్యాలెట్ గడువును పొడిగించారు. రెండు రోజులు గడువు పొడిగించడంతో ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

Similar News

News January 20, 2025

నిర్మల్: పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

image

అంబేడ్కర్ యూనివర్సిటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ట్యూషన్ ఫీజు చెల్లింపు గడువు పొడిగించినట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్, కో ఆర్డినేటర్ గంగాధర్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. డిగ్రీ సెకండ్, థర్డ్ ఇయర్ ట్యూషన్ ఫీజు గడువు జనవరి 25 వరకు చెల్లించవచ్చన్నారు. డిగ్రీ 1,3,5 సెమిస్టర్ ఫీజు గడువు జనవరి 30 వరకు పొడిగించినట్లు చెప్పారు..

News January 20, 2025

రేషన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియ:  ADB కలెక్టర్

image

రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల ఫీల్డ్ వెరిఫికేషన్, గ్రామ సభలపై ఆదివారం సంబంధిత అధికారులతో కలెక్టర్ రాజర్షిషా గూగుల్ మీట్ నిర్వహించారు. ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహించే గ్రామసభలకు విస్తృత ఏర్పాట్లు చేయాలన్నారు. గతంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభల మాదిరిగానే 21 నుంచి చేపట్టే గ్రామ సభలను నిర్వహించాలని అన్నారు.  రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అన్నారు.

News January 19, 2025

బాలుడిని రేప్ చేసి చంపేశాడు : నిర్మల్ ASP

image

నిర్మల్ జిల్లా చిట్యాల గ్రామంలో ఇటీవల జరిగిన <<15184983>>బాలుడి హత్య<<>> కేసును పోలీసులు ఛేధించారు. ఏఎస్పీ రాజేష్ మీనా తెలిపిన వివరాల ప్రకారం.. అదే గ్రామానికి చెందిన తోకల రాజేశ్వర్‌కు హోమో సెక్స్ అలవాటు ఉంది. కామవాంఛ తీర్చుకోవడం కోసం శుక్రవారం అర్ధరాత్రి బాలుడిపై అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా తెలుస్తుందేమోనని భయపడి మత్తులో బాలుడిని హత్య చేశాడు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.