News January 1, 2026
ఆదిలాబాద్: యువకుడి సూసైడ్

తండ్రి మందలించాడని మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉట్నూర్ మండలం హస్నాపూర్‌కి చెందిన రాథోడ్ సాయికిరణ్(27) డయాలసిస్ కేంద్రంలో ఒప్పంద ఉద్యోగం చేస్తున్నాడు. వారం రోజులుగా మద్యం తాగి వస్తుండటంతో ఈనెల 30న తండ్రి బాపురావు మందలించారు. మనస్తాపం చెంది పురుగు మందు తాగగా కుటుంబీకులు రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.
Similar News
News January 2, 2026
త్వరలో 265 పోస్టుల భర్తీ: మంత్రి కోమటిరెడ్డి

TG: R&B శాఖలో ఖాళీగా ఉన్న 265 ఇంజినీర్ల పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఫీల్డ్‌లో ఉండే AEలకు ల్యాప్‌టాప్‌లు అందజేస్తామని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న సీనియారిటీ సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. R&B ఇంజినీర్స్ డైరీ, క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. తమ శాఖ ఇంజినీర్లు, ఉద్యోగులు తనకు కుటుంబ సభ్యులతో సమానమన్నారు. తర్వాత ఉద్యోగులతో కలిసి భోజనం చేశారు.
News January 2, 2026
కృష్ణ వర్ణం – అనంత ఆరోగ్య సంకేతం

కృష్ణుడి నీలిరంగు అనంతమైన ఆకాశానికి, అగాధమైన సముద్రానికి ప్రతీక. ఆయన వ్యక్తిత్వంలోని లోతును, ధైర్యాన్ని ఈ రంగు సూచిస్తుంది. శ్రీకృష్ణుడు ధరించిన ఈ నీలి రంగును చూస్తే మెదడులో ప్రశాంతతనిచ్చే హార్మోన్లు విడుదలవుతాయని పరిశోధనల్లో తేలింది. ఈ రంగు గుండె వేగాన్ని నియంత్రించి ఒత్తిడిని తగ్గిస్తుందట. మానసిక స్థిరత్వాన్ని, రోగనిరోధక శక్తిని ప్రసాదిస్తుందట. నీలి రంగు ఈ విశ్వంలో ప్రాణవాయువుకు చిహ్నం.
News January 2, 2026
సంగారెడ్డి: ‘యూరియా కోసం ఆందోళన చెందవద్దు’

జిల్లాలో సరిపడా యూరియా ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ గురువారం తెలిపారు. జిల్లాలో 4,441 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని చెప్పారు. దశలవారీగా రైతులకు యూరియాను అందిస్తామని పేర్కొన్నారు. రైతులు అవసరం ఉన్నప్పుడు మాత్రమే యూరియాను కొనుగోలు చేయాలని కోరారు.


