News October 28, 2025

ఆదిలాబాద్: ‘రక్తదానానికి కుల మతాలకు సంబంధం లేదు’

image

భీంపూర్ మండలం పిప్పలకోటి గ్రామానికి చెందిన యువకుడు షేక్ ఆఫ్రోజ్ రక్తదానం చేసి ఉదారతను చాటారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన శ్రీరామోజీవార్ అనిల్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. మెరుగైన చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రక్తం అవసరమవగా స్పందించిన షేక్ ఆఫ్రోజ్ మంగళవారం గాంధీ ఆసుపత్రికి వెళ్లి రక్తదానం చేశారు. రక్తదానానికి కుల మతాలకు సంబంధం లేదన్నారు.

Similar News

News October 29, 2025

వరంగల్: పక్షుల కోసం గూళ్లు..!

image

వరంగల్(D) పర్వతగిరి(M) కల్లెడలోని ఓ పాఠశాలలో పక్షులకు ఆహారం, నీరు అందించడానికి గాను ప్రత్యేకంగా గూళ్లను ఏర్పాటు చేశారు. రేకు డబ్బాలు, ప్లాస్టిక్ బాటిల్లు, వెదురు బుట్టలను పక్షుల గూళ్ల మాదిరిగా తయారుచేసి పాఠశాల ఆవరణలోని చెట్లకు వేలాడదీశారు. అందులో గింజలతో పాటు నీళ్లను పెట్టడంతో పక్షులు అక్కడికి వచ్చి తమ ఆకలిని, దాహర్తిని తీర్చుకుంటున్నాయి. దీంతో నిర్వాహకులను పలువురు అభినందిస్తున్నారు.

News October 29, 2025

రెడ్ అలర్ట్‌లో ఆ జిల్లాలు: మంత్రి లోకేశ్

image

AP: తుఫాను వల్ల రాష్ట్రంలో సుమారు 40 లక్షల మంది ప్రజలు ప్రభావితమవుతున్నారని మంత్రి లోకేశ్ తెలిపారు. ‘కాకినాడ, కోనసీమ, ప.గో., కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను అత్యధిక తీవ్రత కలిగిన ప్రాంతాలుగా గుర్తించాం. అవి రెడ్ అలర్ట్‌లో ఉన్నాయి. ఎలాంటి ప్రాణ నష్టం ఉండకూడదనేదే మా లక్ష్యం’ అని ట్వీట్ చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ఈ రాత్రికి ఆయన RTGS కేంద్రంలోనే బస చేయనున్నారు.

News October 29, 2025

జగిత్యాల: ST యువతకు ఉపాధి అవకాశాలు

image

తెలంగాణ డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఎస్టీ నిరుద్యోగ యువతీయువకులకు ఆన్‌లైన్ ద్వారా వివిధ రంగాల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు జగిత్యాల జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కే.రాజ్‌కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లాలోని ఆసక్తిగల ఎస్టీ నిరుద్యోగులు https://deet.telangana.gov.in వెబ్‌ సైట్‌లో నమోదు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.