News January 7, 2026
ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో 315 ప్రత్యేక బస్సులు: ఆర్.ఎం

సంక్రాంతి సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో వివిధ ప్రాంతాలకు 315 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు (ఆర్‌ఎం) భవాని ప్రసాద్ తెలిపారు. ఈ ప్రత్యేక సర్వీసులు ఈ నెల 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని ఆయన వెల్లడించారు. సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ఈ బస్సులను కేటాయించామని, ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు.
Similar News
News February 14, 2026
MDK: పార్టీ మారి గెలిచినా.. ఆశలు గల్లంతు!

రామాయంపేట మున్సిపల్ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 5వ వార్డు నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఎంబీఏ గ్రాడ్యుయేట్ చరిత విజయం సాధించారు. కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో ఆమె తండ్రి సుప్రభాత్ రావు బీఆర్‌ఎస్‌లో చేరి కుమార్తెను గెలిపించుకున్నారు. అయితే మున్సిపల్ పీఠం దక్కించుకోవడంలో బీఆర్‌ఎస్ ఆధిక్యం సాధించలేకపోవడంతో ఛైర్మన్ పదవిపై పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. గెలిచినా నిరాశే ఎదురైంది.
News February 14, 2026
వరంగల్ బల్దియాలో అర్హత లేని వారికి ఉద్యోగాలు!

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అధికారులు అర్హతలేని 15 మందికి అక్రమ మార్గాన ఉద్యోగాలు కట్టబెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టౌన్ ప్లానింగ్ విభాగంలో ఎలాంటి సాంకేతిక పరిజ్ఞాన అర్హత లేని వారికి అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో ఉద్యోగాలు కట్టబెట్టినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్కో వ్యక్తి నుంచి రూ.1,50,000 పుచ్చుకొని చైన్‌మెన్ ఉద్యోగాలు కల్పించినట్లు బల్దియాలో చర్చ జరుగుతోంది.
News February 14, 2026
రైతును రాజుగా మార్చడమే మా లక్ష్యం: అచ్చెన్నాయుడు

రాష్ట్రంలో రైతును రాజుగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని AP వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. యువత వ్యవసాయంవైపు మళ్లాలంటే సాగును లాభదాయక వృత్తిగా మార్చాలని అభిప్రాయపడ్డారు. దీని కోసం ప్రకృతి వ్యవసాయం, సాగులో సాంకేతికత, పండిన పంటకు గిట్టుబాటు ధర, కోత అనంతర పంట నష్టాలను తగ్గించడం, అధిక ఆదాయం వచ్చే పంటలవైపు రైతులను ప్రోత్సహించడం వంటి లక్ష్యాలతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు.


