News January 7, 2026
ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో 315 ప్రత్యేక బస్సులు: ఆర్.ఎం

సంక్రాంతి సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో వివిధ ప్రాంతాలకు 315 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు (ఆర్‌ఎం) భవాని ప్రసాద్ తెలిపారు. ఈ ప్రత్యేక సర్వీసులు ఈ నెల 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని ఆయన వెల్లడించారు. సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ఈ బస్సులను కేటాయించామని, ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు.
Similar News
News February 13, 2026
స్కూళ్లను బాగు చేస్తే ప్రమాణాలు ఎందుకు దిగజారాయి: లోకేశ్

AP: స్కూళ్లలో సదుపాయాల కోసం ₹7500 CR ఖర్చు చేయాల్సి ఉందని మంత్రి లోకేశ్ శాసనమండలిలో తెలిపారు. ‘18 అంశాల్లో స్కూళ్లకు రేటింగ్ ఇవ్వగా 40% 2 స్టార్ కన్నా తక్కువ ఉన్నాయి. 84.3% 3వ తరగతి, 62.5% 5వ తరగతి, 47% 8వ తరగతి విద్యార్థులు 2వ క్లాస్ పాఠ్య పుస్తకాలను చదవలేకపోయారు. YCP హయాంలో అద్భుతంగా చేస్తే లెర్నింగ్ అవుట్ కమ్స్ ఇంతలా ఎందుకు పడిపోయాయి’ అని ప్రశ్నించారు. వీటిని మెరుగుపరుస్తామని చెప్పారు.
News February 13, 2026
BIG BREAKING: నల్గొండలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్

నల్గొండ జిల్లాలోని మున్సిపల్ పీఠాలన్నీ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. జిల్లాలోని మొత్తం 6 మున్సిపాలిటీలకు గాను 6 కాంగ్రెస్ గెలిచింది. మిర్యాలగూడ, హాలియా, దేవరకొండ, చిట్యాల, చండూరు, నందికొండలో అత్యధిక వార్డులు గెలుపొంది, మున్సిపల్ ఛైర్మన్ల పీఠాలను కైవసం చేసుకుంది.
News February 13, 2026
సిరిసిల్లలో BRS విజయం, ధర్మపురిలో కాంగ్రెస్ క్లీన్‌స్వీప్

TG: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో BRS విజయం సాధించింది. ఆ మున్సిపాలిటీలో 39 వార్డులు ఉండగా 27 చోట్ల BRS గెలిచింది. కాంగ్రెస్ 6, బీజేపీ 5, ఇతరులు 1 వార్డు సొంతం చేసుకున్నారు. అటు జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులు గెలుచుకుని కాంగ్రెస్ క్లీన్‌స్వీప్ చేసింది.


