News February 6, 2025

ఆదిలాబాద్: రెండో భార్యను చంపిన భర్త

image

అనుమానంతో వ్యక్తి రెండో భార్యను హత్యచేశాడు. ఈఘటన ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం భీంపూర్‌లో జరిగింది. పోలీసుల ప్రకారం.. గ్రామానికి చెందిన మరోతికి ఇద్దరు భార్యలు. ఈక్రమంలో రెండో భార్య అయిన రుక్కుబాయికి వివాహేత సంబంధం ఉందని అనుమానం పెట్టుకున్నాడు. మద్యం తాగి వచ్చి గొడవ చేసేవాడు, చంపేస్తానని బెదిరించేవాడు. దీంతో మంగళవారం రుక్కుబాయి(26) ఛాతిపై బండతో కొట్టి హత్య చేసి పారిపోయాడు. కేసు నమోదైంది.

Similar News

News December 23, 2025

యాదగిరిగుట్ట: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్

image

యాదగిరిగుట్ట మండలం దాతర్‌పల్లి, రాళ్ల జనగాం గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈరోజు పరిశీలించారు. నిర్మాణ పనులు మొదలుపెట్టి ఎన్ని రోజులు అవుతుందని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు పూర్తయిన వరకు బిల్లులు వచ్చాయా అని అడిగారు. మిగిలిన పనులు కూడా త్వరగా పూర్తి చేస్తే బిల్లు పడుతుందని, అనంతరం గృహప్రవేశం కూడా త్వరగా చేసుకోవాలని సూచించారు.

News December 23, 2025

‘నీళ్లను ఒక్కసారిగా వదులుతోంది’.. భారత్‌పై పాక్ ఆరోపణలు!

image

భారత్ కావాలనే నదీ జలాలను అడ్డుకుంటూ ఇబ్బందులకు గురిచేస్తోందని పాక్ ఆరోపిస్తోంది. చీనాబ్ తర్వాత ఇప్పుడు జీలం, నీలం నదుల ప్రవాహం కూడా తగ్గిపోయిందని అంటోంది. భారత్ అర్ధాంతరంగా నీళ్లు ఆపుతూ ఒక్కసారిగా వదిలేస్తోందని పేర్కొంది. నీటి ప్రవాహం పడిపోవడం తమ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీస్తోందని వాదిస్తోంది. దీనిపై మన ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. పహల్గాం దాడి తర్వాత ‘సింధు జలాల’ ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకుంది.

News December 23, 2025

తల్లి అయిన తర్వాత నా బాడీపై గౌరవం పెరిగింది: కియారా

image

హీరోయిన్ కియారా అద్వానీ రీసెంట్‌గా తన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ గురించి మనసు విప్పారు. 2025 జులైలో పాప పుట్టిన తర్వాత, తన శరీరాన్ని చూసే కోణం మారిందని చెప్పారు. ‘వార్ 2’ సినిమాలో బికినీ సీన్ కోసం చాలా కష్టపడ్డానని, అప్పట్లో పర్ఫెక్ట్ ఫిగర్ కోసం తాపత్రయపడ్డానని గుర్తు చేసుకున్నారు. కానీ ఒక ప్రాణానికి జన్మనిచ్చిన తన శరీరం పట్ల చాలా గౌరవం పెరిగిందని, సైజ్ ముఖ్యం కాదని గుర్తించానని తెలిపారు.