News February 6, 2025
ఆదిలాబాద్: రెండో భార్యను చంపిన భర్త
అనుమానంతో వ్యక్తి రెండో భార్యను హత్యచేశాడు. ఈఘటన ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం భీంపూర్‌లో జరిగింది. పోలీసుల ప్రకారం.. గ్రామానికి చెందిన మరోతికి ఇద్దరు భార్యలు. ఈక్రమంలో రెండో భార్య అయిన రుక్కుబాయికి వివాహేత సంబంధం ఉందని అనుమానం పెట్టుకున్నాడు. మద్యం తాగి వచ్చి గొడవ చేసేవాడు, చంపేస్తానని బెదిరించేవాడు. దీంతో మంగళవారం రుక్కుబాయి(26) ఛాతిపై బండతో కొట్టి హత్య చేశాడు. కేసు నమోదైంది.
Similar News
News February 6, 2025
KMR: సైబర్ మోసాలపై జర జాగ్రత్త..!
సైబర్ మోసగాళ్లు అమాయకులను ఆసరాగా చేసుకుని అందినకాడికి దోచుకుంటున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. బ్యాంకుల నుంచి వచ్చే నకిలీ ఫోన్ కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని, కొంత పెట్టుబడి పెడితే ఎక్కువ సంపాదించవచ్చని ఆశచూపి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలన్నారు. కామారెడ్డి ఇందిరానగర్ ZPHSలో సైబర్ జాగృత దివస్ సందర్భంగా కానిస్టేబుల్ ప్రవీణ్ అవగాహన కల్పించారు.

వరంగల్ మార్కెట్‌లో పత్తి ధర ఎంతంటే..?
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధరలు అన్నదాతలను అయోమయానికి గురి చేస్తున్నాయి. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,000 పలకగా.. మంగళవారం రూ.6,960కి పడిపోయి, బుధవారం రూ.6,980కి చేరింది. అలాగే నేడు మళ్లీ రూ.6970కి తగ్గినట్లు అధికారులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ఉన్న డిమాండ్‌ను బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు.