News April 13, 2025

ఆదిలాబాద్‌: రేపు ITI కళాశాలలో అప్రెంటిషిప్ మేళా

image

ఆదిలాబాద్ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈనెల 14న జాతీయ అప్రెంటిషిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లాలోని ఐటీఐ ఉత్తీర్ణులైనా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ మేళాలో పలు కంపెనీలు పాల్గొంటాయని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిషిప్ యాక్ట్ ప్రకారంగా స్టైపెండ్‌ను శిక్షణ కాలంలో నేరుగా అభ్యర్థుల ఖాతాలకు జమ చేస్తాయన్నారు.

Similar News

News April 14, 2025

ఆదిలాబాద్: పిల్లలపై నిరంతరం అప్రమత్తంగా ఉండండి

image

మరికొద్ది రోజుల్లో విద్యార్థులకు 2 నెలల వేసవి సెలవులు రానున్నాయి. దీంతో పిల్లలు నదులు, చెరువుల్లో ఈత కొట్టడానికి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకునే అవకాశం ఉంది. కనుక తల్లిదండ్రులు పిల్లల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. వారిపై ఎప్పటికీ అప్పుడు నిఘా ఉంచాలి. అలాగే ఎండలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలు బయటకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

News April 14, 2025

అగ్నిమాపక వారోత్సవాలను విజయవంతం చేయండి: ADB కలెక్టర్

image

ఈనెల 14 నుంచి 20 వరకు నిర్వహించనున్న అగ్నిమాపక వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ రాజర్షిషా పేర్కొన్నారు. ఆదివారం ఆదిలాబాద్‌లోని క్యాంప్ కార్యాలయంలో వారోత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. అగ్ని ప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఫైర్ ఆఫీసర్ జైత్రాం, యస్దాని, సంగాన్న, తదితరులు ఉన్నారు.

News April 14, 2025

జైనథ్‌లో ఆరుగురు జూదరులు అరెస్ట్ 

image

జైనథ్‌లోని సావపూర్ శివారులో పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు సీఐ సాయినాథ్ తెలిపారు. వారి వద్ద నుంచి పేక ముక్కలు, రూ.16,830 సీజ్ చేశామన్నారు. మండలంలో ఎక్కడైనా పేకాట, మట్కా, గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నట్లయితే సమాచారం ఇవ్వాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని సీఐ సూచించారు.

error: Content is protected !!