News August 28, 2024

ఆదిలాబాద్: రేషన్ కార్డులు లేనివారికి రుణమాఫీ

image

ఆదిలాబాద్ జిల్లాలో రూ.2లక్షల లోపు రుణం ఉండి రేషన్ కార్డు లేక రుణమాఫీ కాని రైతులకు రుణమాఫీ చేయనున్నట్లు ఇన్‌ఛార్జ్ జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ స్వామి తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 3 విడతల్లో రుణమాఫీ అయింది. రేషన్ కార్డు లేక రుణమాఫీ కాని రైతులను గుర్తించి వారి కుటుంబ వివరాలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేసి ప్రభుత్వానికి నివేదించనున్నారు. ఇందుకోసం మండలాల వారీగా నోడల్ అధికారులను నియమించనున్నారు.

Similar News

News September 16, 2025

ADB: కాంగ్రెస్ గూటికి మాజీ నేతలు

image

TPCC అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన పలువురు మాజీ నేతలు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఇందులో మాజీ TPCC ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజీద్ ఖాన్, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా వారు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటి సీఎం భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు.

News September 16, 2025

ADB: మొదలై వెంటనే ముగిసిన ఓ తల్లి విషాద గాథ..!

image

సిరికొండ మండలం బీంపూర్‌కు చెందిన తోడసం ఏత్మ భాయి(20) ప్రసవం తర్వాత మృతి చెందడం విషాదాన్ని నింపింది. ఈనెల 12న పురిటి నొప్పులతో ఆమెను ఇంద్రవెల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, బాలుడికి జన్మనిచ్చింది. 14వ తేదీన డిశ్చార్జ్ అయ్యాక తీవ్రమైన తలనొప్పి రావడంతో 108లో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

News September 16, 2025

ADB: OPEN స్కూల్ అడ్మిషన్‌లకు గడువు పొడిగింపు

image

టెన్త్, ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల కోసం గడువును పొడగించినట్లు జిల్లా విద్యాధికారి (డీఈఓ) ఖుష్బూ గుప్తా తెలిపారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈనెల 12వ తేదీ వరకు అవకాశం ఉండగా 18 వరకు పొడగించినట్లు పేర్కొన్నారు. అపరాధ రుసుంతో సెప్టెంబర్ 20వ తేదీ వరకు గడువు ఉందని వెల్లడించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.