News July 19, 2024

ఆదిలాబాద్ రైతుతో మాట్లాడిన CM రేవంత్ రెడ్డి

image

తాంసి మండలం బండల్ నాగపూర్ గ్రామంలోని రైతు వేదికలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మహేందర్ అనే రైతుతో CM రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఎన్ని ఎకరాలు ఉన్నాయని CM అడుగగా రైతు ఒక ఎకరం సగం ఉన్నదని బదులిచ్చారు. 50,000 లోన్ తీసుకున్నాను ఏకకాలంలో రుణమాఫీ అవడం చాలా సంతోషంగా ఉన్నదని రైతు తెలిపారు. మీ ఊరిలో అందరికీ చెప్పాలి మీ ఆదిలాబాద్ జిల్లాకి 120 కోట్లు ఇస్తున్నామని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Similar News

News August 26, 2025

ADB: మట్టి గణపతులను పంపిణీ చేసిన కలెక్టర్

image

పర్యావరణాన్ని రక్షించేందుకు, నదుల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనం వల్ల కలిగే హానిని నివారించేందుకు మట్టి గణపతులు దోహదపడుతాయని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం ఆదిలాబాద్‌లోని టీటీడీసీలో గణపతి ఉత్సవాల నేపథ్యంలో పర్యావరణ హితం కోసం మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. 2,000 ఎస్‌హెచ్‌జి గ్రూపులకు, 1,000 మెప్మా ఆర్‌పీలకూ మట్టి విగ్రహాలను అందజేశారు.

News August 26, 2025

ఆదిలాబాద్ ఎస్పీని కలిసిన నూతన FDO

image

ఆదిలాబాద్ ఎఫ్‌డీఓగా శిక్షణ ఐఎఫ్ఎస్ చిన్న విశ్వనాథ బుసరెడ్డి నియామకమయ్యారు. మంగళవారం ఎస్పీ అఖిల్ మహాజన్‌ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేసి పరిచయం చేసుకున్నారు. జిల్లాలో అడవుల సంరక్షణ, వేటగాళ్ల నుంచి అడవి జంతువులను కాపాడటం తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. పోలీస్, ఫారెస్ట్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టవలసిన కార్యక్రమాలపై చర్చించారు.

News August 26, 2025

ADB: నేవీ ఉద్యోగం సాధించిన కామర్స్ విద్యార్థి

image

ADB ప్రభుత్వ ఆర్ట్స్‌, కామర్స్‌ డిగ్రీ కళాశాలలో BA రెండో సంవత్సరం చదువుతున్న కుమ్ర శశికాంత్‌ నేవీలో ఉద్యోగం సాధించాడు. సోమవారం కళాశాలలో శశికాంత్‌ను కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ అతిక్‌ బేగం ఘనంగా సన్మానించారు. దేశ సరిహద్దుల్లో సేవ చేయడానికి తమ కళాశాల విద్యార్థి వెళ్లడం గర్వకారణమని అభినందనలు తెలిపారు.