News January 31, 2025
ఆదిలాబాద్: వన్ టౌన్‌లో అట్రాసిటీ కేసు నమోదు

ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. CI సునీల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక మోచిగల్లికి చెందిన బాలశంకర్ కృష్ణను సామల ప్రశాంత్ అనే వ్యక్తి ఈనెల 12న వివేకానంద చౌక్‌లో కులం పేరుతో దూషించి, చంపేస్తానని హెచ్చరించినట్లు బాధితుడు ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు CI పేర్కొన్నారు
Similar News
News January 2, 2026
జైనథ్: కిసాన్ యాప్‌ను వెంటనే తొలగించాలి: మాజీ మంత్రి

రైతులకు అన్యాయం చేసే కిసాన్ యాప్‌ను వెంటనే తొలగించాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. రైతు కొనుగోలు సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం జైనథ్ మండలం కాప్రి వద్ద జాతీయ రహదారిపై రైతులతో కలిసి బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. దీంతో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయ్యింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తుందని మండిపడ్డారు.
News January 2, 2026
ఆదిలాబాద్: వీడీసీల ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధం: ఎస్పీ

వీడీసీలు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. గ్రామాభివృద్ధి పేరుతో వసూళ్లకు పాల్పడుతూ బెల్టు షాపులు, కళ్లు దుకాణాలు, ఇసుక తవ్వకాలకు అనధికారికంగా అనుమతులు ఇస్తే వీడీసీలపై కేసులు తప్పవన్నారు. వీడీసీల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనేవారు నిర్భయంగా జిల్లా పోలీసులను సంప్రదించాలని సూచించారు.
News January 2, 2026
ఇంద్రవెల్లి: బంగారం చోరీ.. కనిపిస్తే సమాచారం ఇవ్వండి

ఇంద్రవెల్లి మార్కెట్లో ఓ ముసలమ్మ వద్ద బంగారు చెవిపోగులు చోరీకి గురైనట్లు ఎస్ఐ సాయన్న తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా దొంగను గుర్తించి అతడి ఫొటోను రిలీజ్ చేశామన్నారు. పైన ఉన్న వ్యక్తి కనిపిస్తే వెంటనే 8712659941 ఈ నంబర్‌కు సమాచారం అందించి సహకరించాలని కోరారు.


