News February 6, 2025
ఆదిలాబాద్: ‘వార్షిక పరీక్షలపై ఒత్తిడికి గురికావద్దు’

సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో బీసీ స్టడీ సర్కిల్ ఆదిలాబాద్‌లో ఫ్రీ మెట్రిక్ వసతి గృహ పదో తరగతి విద్యార్థులకు ప్రేరణ తరగతుల కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ రాజార్షి షా పాల్గొని ప్రారంభించారు. పదోతరగతి విద్యార్థులకు వార్షికపరీక్షలకు అవసరమైన సామగ్రిని కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలని సూచించారు.
Similar News
News March 2, 2026
ADB: ‘హెల్త్ మిషన్ – 100’ ప్రారంభం

ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘హెల్త్ మిషన్ – 100’ ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమం చేపట్టిందని కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో హెల్త్ మిషన్ – 100 ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, కౌమార దశలోని వారు, వృద్ధులకు నాణ్యమైన వైద్య సేవలను నేరుగా చేరువ చేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు.
News March 2, 2026
ఆదిలాబాద్: ప్రజావాణి కార్యక్రమంలో అర్జీల స్వీకరణ

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజర్షిషా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించారు. అధికారులు తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆర్డీవో స్రవంతి, డీఆర్డీవో రవీందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది ఉన్నారు.
News March 2, 2026
ఆదిలాబాద్: కలెక్టరేట్‌లో దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసన సభాపతి దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో స్రవంతి, డీఆర్డీవో రవీందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, ఏవో వర్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది ఉన్నారు.


