News October 18, 2025
ఆదిలాబాద్: విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

తలమడుగు మం. ఉమ్రి ఆశ్రమ బాలిక పాఠశాల విద్యార్థిని పినాయిల్ తాగిన ఘటన గురువారం జరిగింది. స్థానికుల ప్రకారం.. దసర సెలవులకు వెళ్లిన ఓ విద్యార్థిని తల్లిదండ్రులను బట్టలకు డబ్బులు అడిగింది. వారు నిరాకరించడంతో పాఠశాలకు వెళ్లింది. గురువారం రాత్రి బాత్రూంకి వెళ్లి పినాయిల్ తాగింది. గమనించిన సిబ్బంది ఆమెను PHCకి, అక్కడి నుంచి RIMSకి తరలించగా చికిత్స పొందుతోంది. సమాచారంతో కుటుంబీకులు రిమ్స్‌కు చేరుకున్నారు.
Similar News
News October 18, 2025
మహిళలకు వేపాకుతో చర్మ సౌందర్యం

* వేపాకులో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. చర్మ ఆరోగ్యం, సౌందర్యానికి వేపాకు ఎంతో మేలు చేస్తుంది.
* నీటిలో గుప్పెడు వేపాకులను వేసి మరిగించాలి. తర్వాత వడగట్టి ఆ కషాయాన్ని పడుకునే ముందు ముఖానికి రుద్దుకుంటే మొటిమలు, మచ్చలు, జిడ్డు దూరమవుతాయి.
* నీటిలో కలుపుకుని స్నానం చేస్తే ఇన్ఫెక్షన్లు దరిచేరవు.
✍️ రోజూ స్కిన్, హెయిన్ కేర్ టిప్స్ కోసం <<-se_10014>>వసుధ<<>> క్లిక్ చేయండి.
News October 18, 2025
క్రీడాధికారిగా వైకుంఠరావు బాధ్యతల స్వీకరణ

అంబేడ్కర్ కోనసీమ జిల్లా నూతన క్రీడా అధికారిగా వైకుంఠరావు శనివారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన అమలాపురంలో జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. తాను పదవి బాధ్యతలు చేపట్టినట్టు కలెక్టర్‌కు వైకుంఠరావు వివరించారు. జిల్లాలో క్రీడా రంగ అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ కోరారు. ప్రభుత్వం కూడా క్రీడా రంగ అభివృద్ధికి అన్ని ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు.
News October 18, 2025
శాంతిపురం : రోడ్డు ప్రమాదంలో ఒకరు స్పాట్ డెడ్

శాంతిపురం (M) బడుగుమాకులపల్లి వద్ద బైకును కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. కెనమాకులపల్లికి చెందిన వెంకటరామప్ప (55), సత్యప్ప (60) బైకుపై బడుగు మాకులపల్లి వైపు వెళ్తుండగా ఎదురుగా పలమనేరు వైపు నుంచి వచ్చిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకట రామప్ప అక్కడికక్కడే మృతిచెందగా, సత్యప్ప తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను ఆసుపత్రికి తరలించారు.