News January 6, 2026

ఆదిలాబాద్: విద్యుత్ వినియోగదారులకు టోల్ ఫ్రీ

image

విద్యుత్ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించే క్రమంలో 1912 టోల్ ఫ్రీ సేవలను వినియోగించుకోవాలని ఆదిలాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ శేషారావు పేర్కొన్నారు. 16 సర్కిళ్ల విద్యుత్ వినియోగదారులు ఈ టోల్ ఫ్రీ సేవలను సద్వినియోగ పరుచుకోవాలని పేర్కొన్నారు. 1912కు ఫోన్ చేయగానే ఫిర్యాదును స్వీకరించి, నమోదు చేసి సమాచారాన్ని సంబంధిత అధికారికి వెళ్తుందన్నారు.

Similar News

News February 7, 2026

ఆదిలాబాద్: సమయం లేదు మిత్రమా..!

image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ సమీపిస్తుండడంతో ప్రచారం జోరుగా సాగుతోంది. ఆదిలాబాద్ పట్టణంలోని 49 వార్డుల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు సైతం జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేలా విశ్వ ప్రయత్నాలతో ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. కాగా ప్రచారానికి సమయం నేటితో కలిపి మరో రెండు రోజులు మాత్రమే ఉండటంతో ఉదయం నుంచి రాత్రి వరకు విస్తృతంగా ప్రచారాలు జరుగుతున్నాయి.

News February 7, 2026

ADB: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి: కలెక్టర్

image

క్రీడా రంగాల్లో రాణించడం ద్వారా అనేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందవచ్చని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఎస్సీ వసతి గృహాల విద్యార్థులకు శుక్రవారం ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని సూచించారు.