News March 14, 2025

ఆదిలాబాద్: వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్

image

విద్యా శాఖ కార్యదర్శి (FLN) విద్యార్థుల్లో అభ్యాస సామర్థ్యాలను బలోపేతం చేసే అంశంపై గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో, విద్యాధికారులతో, నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. AI ఆధారిత పరిజ్ఞానంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువులో వెనుకబడి ఉన్న విద్యార్ధులకు సులువుగా శ్రద్ధతో చదవడానికి పైలట్ ప్రాజెక్ట్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు.

Similar News

News February 1, 2026

జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు: ADB ఎస్పీ

image

శాంతిభద్రతల పరిరక్షణ ప్రశాంతంగా సాగేందుకు ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా సభలు, ర్యాలీలు, ధర్నాలు, ఊరేగింపులు, డీజేలు, మైకులు, అధిక శబ్ద పరికరాలు నిషేధమని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News February 1, 2026

ఆపరేషన్ స్మైల్‌తో బాల కార్మికుల విముక్తి: ఎస్పీ

image

ఆదిలాబాద్ జిల్లాలో జనవరి నెల పొడవునా నిర్వహించిన ‘ఆపరేషన్ స్మైల్’ ద్వారా 85 మంది బాల కార్మికులను రక్షించినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. వీరిలో 79 మంది బాలురు, ఆరుగురు బాలికలు ఉన్నారని పేర్కొన్నారు. రక్షించిన వారిలో 72 మందిని తల్లిదండ్రులకు అప్పగించగా, 13 మందిని వసతి గృహాలకు చేర్చామన్నారు. జిల్లావ్యాప్తంగా 35 కేసులు నమోదు చేశామని, బాలలను పనిలో పెట్టుకోకుండా బడులకు పంపాలని ఎస్పీ పిలుపునిచ్చారు.

News February 1, 2026

ఆదిలాబాద్: రేపటి నుంచి INTER ప్రాక్టికల్స్

image

జిల్లాలో ఫిబ్రవరి 2 నుంచి 11 వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కన్వీనర్ గణేశ్ కుమార్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 36 కేంద్రాల్లో రెండు విడతల్లో పరీక్షలు జరుగుతాయన్నారు. చీఫ్ సూపరింటెండెంట్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ప్రశ్నాపత్రాలను ఆన్‌లైన్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. పరీక్షలు పారదర్శకగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు.