News January 2, 2026

ఆదిలాబాద్: వీడీసీల ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధం: ఎస్పీ

image

వీడీసీలు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. గ్రామాభివృద్ధి పేరుతో వసూళ్లకు పాల్పడుతూ బెల్టు షాపులు, కళ్లు దుకాణాలు, ఇసుక తవ్వకాలకు అనధికారికంగా అనుమతులు ఇస్తే వీడీసీలపై కేసులు తప్పవన్నారు. వీడీసీల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనేవారు నిర్భయంగా జిల్లా పోలీసులను సంప్రదించాలని సూచించారు.

Similar News

News February 14, 2026

ఆదిలాబాద్: కువైట్ నుంచి వచ్చి.. కౌన్సిలర్‌గా గెలిచి

image

ఆదిలాబాద్‌ కువైట్‌లో సుదీర్ఘకాలం పనిచేసిన మెహబూబ్ 33వ వార్డులో విజయం సాధించారు. విదేశాల్లో ఉన్నప్పుడు ‘గోల్డెన్ తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్’ ద్వారా భారతీయుల సమస్యలపై పోరాడారు. స్వగ్రామంపై మక్కువతో ఎన్నికల బరిలో నిలిచి ఓటర్ల ఆదరణ పొందారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ధీమా వ్యక్తం చేశారు. సేవా దృక్పథమే తనను గెలిపించిందని మెహబూబ్ పేర్కొన్నారు.

News February 13, 2026

ఉట్నూర్: 4KGల గంజాయి స్వాధీనం.. ముగ్గురి అరెస్ట్

image

నమ్మదగిన సమాచారంతో ఇంద్రవెల్లి పోలీసులు శ్మశానవాటిక వద్ద నిఘా ఉంచి గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు కొడప రమేష్, కుంర గంగారం, కుముర కృష్ణల వద్ద నుంచి 4కిలోల గంజాయి, మోటార్ సైకిల్, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితులను ఉట్నూర్ కోర్టులో రిమాండ్ చేసినట్లు ఎస్ఐ సాయన్న వెల్లడించారు.

News February 13, 2026

సిబ్బందికి శుభాకాంక్షలు: ఆదిలాబాద్ కలెక్టర్

image

జిల్లాలో మున్సిపల్ కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. కౌంటింగ్ విధుల్లో పాల్గొన్న సిబ్బంది క్రమశిక్షణతో, అంకితభావంతో పనిచేసి మొత్తం ప్రక్రియను సాఫీగా పూర్తి చేశారని ఆయన అభినందించారు. మద్దతు అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. కౌంటింగ్‌లో పాల్గొన్న సిబ్బంది, భద్రతా సిబ్బంది, సంబంధిత అధికారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.