News December 18, 2025
ఆదిలాబాద్: హస్తం హవా.. ముగిసిన పంచాయతీ సమరం

ఆదిలాబాద్ జిల్లాలో మూడు విడతలుగా 1,505 పంచాయతీల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మూడు విడతల్లో కాంగ్రెస్ 604 సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకుంది. BRS 351తో రెండో స్థానం కైవసం చేసుకోగా బీజేపీకు 257 సర్పంచ్ స్థానాలు దక్కాయి. 294 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. రాష్ట్రంలో ప్రభుత్వం అధిష్ఠానంలో ఉండడంతో కాంగ్రెస్ బలపరచిన అభ్యర్థులకు కలసి వచ్చినట్లు తెలుస్తోంది.
Similar News
News December 18, 2025
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సంగారెడ్డి ఎస్పీ పరదేశి పంకజ్ సూచించారు. ఎస్పీ కార్యాలయంలో సైబర్ అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. గుర్తుతెలియని వ్యక్తులు ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో ఫోన్ చేస్తే నమ్మవద్దని, వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని కోరారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
News December 18, 2025
ADB: UPSCలో సత్తా చాటిన జిల్లా యువకుడు

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)లో ఆదిలాబాద్ జిల్లా యువకుడు నోముల సాయి కిరణ్ 82వ ర్యాంక్ సాధించి సత్తా చాటాడు. తాంసి మండలం పొన్నారి గ్రామానికి చెందిన నోముల అనసూయ-గంగన్నల కుమారుడు సాయి కిరణ్ ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ (IES) సాధించాడు. పలువురు సాయి కిరణ్‌కు అభినందిస్తున్నారు.
News December 18, 2025
ఫలితాలు విడుదల

TG: గ్రూప్-3 ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 1,370 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు తెలిపింది. అభ్యర్థుల జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఇటీవల సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిగిన సంగతి తెలిసిందే. ఒక పోస్ట్ వెరిఫికేషన్ కోసం పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపింది. మరో 17 పోస్టుల వివరాలు త్వరలో వెల్లడిస్తామంది. లిస్ట్ కోసం ఇక్కడ <


