News February 26, 2026

ఆదిలాబాద్: హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి

image

ఉమ్మడి జిల్లాలోని విద్యార్థులు ఫౌండేషన్ కోర్సుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు tsstudycircle.co.in వెబ్‌సైట్‌లో హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలని షెడ్యూల్డ్ కులాల అభివృధి అధికారి సునీతకుమారి పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లోని నలంద కళాశాలలో మార్చి 1న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుందని తెలిపారు. పూర్తి వివరాల కోసం 9494149416 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

Similar News

News February 26, 2026

HYD: మూసీ సుందరీకరణ.. నిధుల కోసం ఢిల్లీ బాట!

image

మూసీ పునరుజ్జీవనంపై సర్కారు పట్టుదలతో ఉన్నా, నిధుల వేట సవాలుగా మారింది. రూ.17 వేల కోట్ల మాస్టర్ ప్లాన్‌కు కేంద్ర బడ్జెట్‌లో ఆశించిన మద్దతు లభించలేదు. దీంతో ప్రాజెక్టు అమలులో జాప్యం జరిగేలా కనిపిస్తోంది. సర్వేలు పూర్తయినా, భూసేకరణ, పునరావాసంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కావడంతో నిధుల కోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది.

News February 26, 2026

NLG: మెడికల్ కాలేజీ అభివృద్ధికి రూ.85 కోట్లు: మంత్రి కోమటిరెడ్డి

image

ప్రభుత్వ మెడికల్ కళాశాల వార్షికోత్సవంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఆగిపోయిన పనులను రూ.85 కోట్లతో పూర్తి చేసి కళాశాలను ఆదర్శంగా తీర్చిదిద్దామని తెలిపారు. వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని, కాబోయే డాక్టర్లు మానవత్వంతో పేదలకు సేవలందించాలని సూచించారు. విద్యార్థుల సౌకర్యార్థం బస్సులను అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు.

News February 26, 2026

HYD: మూసీ ప్రక్షాళన.. అసలు కథ ఇదే!

image

మూసీ ప్రక్షాళనలో ‘మార్కింగ్’ వ్యవహారం కలకలం రేపుతోంది. FTL పరిధిలోని 40కి పైగా భారీ కమర్షియల్ నిర్మాణాలను కూల్చకుండా, భారీ జరిమానాలతో రెగ్యులరైజ్ చేసే యోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం. నది వెడల్పు తగ్గించి, PPP పద్ధతిలో ఖరీదైన భూములను రియల్టర్లకు కట్టబెట్టే మాస్టర్ ప్లాన్ సిద్ధమైనట్లు విమర్శలు వస్తున్నాయి. దీనివల్ల సామాన్యుల ఇళ్లు పోయి, బడా వ్యాపారులకు మేలు జరుగుతుందనే చర్చ జోరందుకుంది.