News February 28, 2025
ఆదిలాబాద్: 2019లో 59.03%.. 2025లో 70.42%

ఉమ్మడి ADB, NZB, KNR, MDK పట్టభద్రులు, ఉపాధ్యాయ MLC ఎన్నికల పోలింగ్ నిన్న జరగగా.. మార్చి 3న కరీంనగర్‌లో లెక్కింపు జరగనుంది. అయితే, 2019లో పట్టభద్రుల పోలింగ్ 59.03శాతం నమోదు కాగా, 2025లో 70.42 శాతం నమోదైంది. ఉపాధ్యాయ పోలింగ్ 2019లో 83.54శాతం నమోదు కాగా, 2025లో 91.90శాతం పోలింగ్ జరిగింది. 2019 ఎన్నికలతో పోలిస్తే పట్టభద్రుల పోలింగ్ 11.39శాతం, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ 8.36 శాతం పెరిగింది.
Similar News
News February 28, 2025
ఆ రేపిస్టుల కన్నా పిశాచాలే మేలేమో!

ఈ దుర్యోధన, దుశ్శాసన, దుర్వినీత లోకంలో.. రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో.. మరో మహాభారతం, ఆరవ వేదం, మానభంగ పర్వంలో మాతృ హృదయ నిర్వేదం.. అని వేటూరి రాసింది అక్షరసత్యం. రేపిస్టుల దారుణాలను చూస్తే వారి కన్నా పిశాచాలే మేలేమో అనిపిస్తోంది. పుణేలో బస్సులో యువతిపై అత్యాచారం. గ్వాలియర్లో ఐదేళ్ల <<15601122>>చిన్నారి<<>>పై అఘాయిత్యం. రక్తపు మడుగులో పడున్న ఆమె మర్మాంగాలకు 29 కుట్లు పడ్డాయి. ఏం చేస్తే వీళ్లు మారేను!
News February 28, 2025
విద్యార్థులకు మూడో భాష అక్కర్లేదు: స్టాలిన్

Ai కాలంలో విద్యార్థులకు మూడో భాష అక్కర్లేదని తమిళనాడు సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు. ‘ట్రాన్స్‌లేషన్ కోసం టెక్నాలజీ రావడంతో భాషకు అడ్డంకులు తొలగిపోయాయి. పిల్లలను అదనపు భాషతో ఇబ్బంది పెట్టొద్దు. వాళ్లు మదర్ టంగ్‌తో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీలో పట్టు కోసం ఇంగ్లిష్ నేర్చుకుంటే చాలు’ అని ట్వీట్ చేశారు. కాగా, NEPలో భాగంగా దేశవ్యాప్తంగా స్థానిక భాషతో పాటు హిందీ, ఇంగ్లిష్ తేవాలని కేంద్రం ప్రయత్నిస్తోంది.
News February 28, 2025
గోరంట్ల మాధవ్‌పై ఎస్పీకి ఫిర్యాదు

వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలపై టీడీపీ, జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వంలో అంతర్యుద్ధం మొదలైందని ఆయన చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా మాధవ్ వ్యవహరించారని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్‌కు ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.