News February 28, 2025
ఆదిలాబాద్: 2019లో 59.03%.. 2025లో 70.42%

ఉమ్మడి ADB, NZB, KNR, MDK పట్టభద్రులు, ఉపాధ్యాయ MLC ఎన్నికల పోలింగ్ నిన్న జరగగా.. మార్చి 3న కరీంనగర్‌లో లెక్కింపు జరగనుంది. అయితే, 2019లో పట్టభద్రుల పోలింగ్ 59.03శాతం నమోదు కాగా, 2025లో 70.42 శాతం నమోదైంది. ఉపాధ్యాయ పోలింగ్ 2019లో 83.54శాతం నమోదు కాగా, 2025లో 91.90శాతం పోలింగ్ జరిగింది. 2019 ఎన్నికలతో పోలిస్తే పట్టభద్రుల పోలింగ్ 11.39శాతం, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ 8.36 శాతం పెరిగింది.
Similar News
News July 4, 2025
విద్యార్థులతో కలిసి భోజనం చేసిన KMR కలెక్టర్

రాజంపేట మండలం తలమడ్ల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మధ్యాహ్న భోజనం పథకాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. మధ్యాహ్న భోజనంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తనతో నేరుగా చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వీణ, తహశీల్దార్, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
News July 4, 2025
డైరెక్ట్‌గా OTTలోకి వచ్చేసిన కీర్తి సురేశ్ మూవీ

కీర్తి సురేశ్, సుహాస్ జంటగా నటించిన సెటైరికల్ కామెడీ డ్రామా ‘ఉప్పు కప్పురంబు’ ఇవాళ డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రసారమవుతోంది. డైరెక్టర్ అని IV శశి తెరకెక్కించిన ఈ మూవీకి స్వీకర్ అగస్తి మ్యూజిక్ అందించారు. ఓ గ్రామంలో ఎదురైన అసాధారణ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొన్నారనేదే సినిమా కథ.
News July 4, 2025
GWL: ‘రైతులకు న్యాయం చేసేందుకు సహకరిస్తాం’

భారత్ మాల రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయపరంగా పరిహారం అందించేందుకు సహకరిస్తామని కలెక్టర్ సంతోశ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఛాంబర్‌లో అయిజ మండలం జడదొడ్డి, బింగిదొడ్డి గ్రామాల రైతులతో సమావేశమయ్యారు. రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పరిహారం పెంచే విధంగా జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ అధికారులతో చర్చిస్తామన్నారు.