News May 3, 2024

ఆదిలాబాద్: 2019 ఎన్నికల్లో వచ్చిన ఓట్ల వివరాలు!

image

ADB పార్లమెంట్‌లో 3 ప్రధానపార్టీలు ఆదివాసీలకు టికెట్లు కేటాయించాయి. నియోజకవర్గంలో 16.50 లక్షల ఓటర్లు ఉన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను చూస్తే BJP సోయంకు 3,77,374 ఓట్లు రాగా, BRS గోడం నగేశ్‌కు 318,814 ఓట్లు వచ్చాయి, కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన రాథోడ్ రమేష్‌కి 3,14,238 ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం నగేశ్, రమేశ్ ఒకే గొడుగు కింద రావడంతో సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని చూస్తున్నారు.

Similar News

News March 9, 2026

ఆదిలాబాద్: పలువురు తహశీల్దార్‌లకు స్థానచలనం

image

ముగ్గురు తహశీల్దార్లు, నలుగురు నాయబ్ తహశీల్దార్లకు స్థానచలనం కలిగింది. మండలాల్లో పనిచేస్తున్న అధికారులను బదిలీ చేస్తూ కలెక్టర్ రాజర్షిషా ఉత్తర్వులు జారీ చేశారు. భీంపూర్ తహశీల్దార్ నలంద ప్రియను కలెక్టర్ కార్యాలయ హెచ్-విభాగం సూపరింటెండెంట్‌గా బదిలీ అయ్యారు. ఉట్నూర్ తహశీల్దార్ ప్రవీణ్ కుమార్ బేలకు స్థానచలనం కల్పించారు. కలెక్టర్ కార్యాలయం-హెచ్ సూపరింటెండెంట్ పంచపూలను డీ విభాగానికి వెళ్లారు.

News March 9, 2026

ఆదిలాబాద్: రేపే జాబ్ మేళ.. అన్ని ఏర్పాట్లు పూర్తి

image

ఆదిలాబాద్ పట్టణంలోని AR హెడ్ క్వాటర్స్‌లో మంగళవారం మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సుమారు 50 వరకు కంపెనీలు ఇందులో పాల్గొని దాదాపు 2,000 మందిని భర్తీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఆసక్తి గల నిరుద్యోగులు తమ ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.

News March 8, 2026

ADB: ట్రేడ్ టెస్ట్ పరీక్షలకు దరఖాస్తులు

image

ITI సంబంధిత ఏదైనా ట్రేడుల్లో అనుభవం ఉండి సర్టిఫికేట్ లేని ప్రైవేట్ అభ్యర్థుల నుంచి ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ పరీక్షలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆదిలాబాద్ ప్రభుత్వ ITI ప్రిన్సిపల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ITI కోర్సులకు సంబంధించిన ట్రేడుల్లో కనీసం 3 సం.ల పని అనుభవం కలిగి, 21 వయస్సు వారు అర్హులని పేర్కొన్నారు. ఈ నెల 15 లోపు వరంగల్‌లోని రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ అఫీసులో దరఖాస్తు చేసుకోవాలన్నారు.