News March 20, 2025

ఆదిలాబాద్: 22న యువజన ఉత్సవ పోటీలు

image

ADB ప్రభుత్వ డిగ్రీ కళాశాల (సైన్స్‌)లో మార్చ్ 22న జిల్లాస్థాయి యువజన ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ జే.సంగీత, నెహ్రూ యువజన కేంద్ర జిల్లా కోఆర్డినేటర్ సుశీల్ బడ్ ప్రకటనలో పేర్కొన్నారు. పోటీల్లో 15-29 వయసున్న డిగ్రీ చదివినా లేదా చదువుతున్న యువతీ యువకులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. పెయింటింగ్, మొబైల్ ఫొటోగ్రఫీ, కవితా రచన, ఉపన్యాసం, సాంస్కృతిక నృత్య విభాగంలో పోటీలు ఉంటాయన్నారు.

Similar News

News March 20, 2025

ADB: రిమ్స్‌లో అన్ని డెలివరీలు చేయాలి: కలెక్టర్

image

రిమ్స్ ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్య సేవలు అందించడంలో వైద్యులు వైద్య సిబ్బంది ముందుండాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. రిమ్స్ వైద్య కళాశాలలో బుధవారం అన్ని శాఖల ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో సమీక్ష నిర్వహించారు. రిమ్స్ ఆస్పత్రికి వచ్చే వారందరూ పేద ప్రజలేనని.. వారిని దృష్టిలో ఉంచుకొని వైద్య సేవలు అందించాలన్ నారు. ముఖ్యంగా గైనకాలజీ డిపార్ట్మెంట్లో అన్ని రకాల డెలివరీస్ చేయాలని పేర్కొన్నారు.

News March 20, 2025

ADB: ఇంటర్ పేపర్ కరెక్షన్‌కు వేళాయె..!

image

తెలుగు, హిందీ, ఆంగ్లం, గణితం, పౌరశాస్త్రం సబ్జెక్టుల ఇంటర్మీడియట్ మొదటి విడత మూల్యాంకనం ఈనెల 21 నుంచి ప్రారంభిస్తామని డీఐఈఓ జాదవ్ గణేశ్ కుమార్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ రెసిడెన్షియల్, కేజీబీవీ, ఆదర్శ, ప్రైవేట్ కళాశాల్లో విధులు నిర్వహిస్తున్న అధ్యాపకులు ADBలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో రిపోర్ట్ చేయాలని సూచించారు. అధ్యాపకులు ఉదయం 10:00 గంటలలోపు రిపోర్ట్ చేయాలన్నారు.

News March 20, 2025

ADB: 144 సెక్షన్ అమలు.. ఈ దుకాణాలు బంద్: SP

image

ADB జిల్లాలో ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ఎస్(144సెక్షన్) అమల్లో ఉంటుందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదన్నారు. మైకులకు, డీజేలతో, ఊరేగింపులకు, ధర్నాలకు, ప్రచారాలకు అనుమతులు లేవని తెలిపారు. పరీక్ష సమయంలో ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ దుకాణాలను మూసివేసి ఉంచాలని ఆదేశించారు.

error: Content is protected !!