News February 24, 2026
ఆదిలాబాద్ AIRPORTపై కలెక్టరేట్‌లో సమీక్ష

ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రతిపాదిత ఎయిర్‌పోర్టు మాస్టర్ ప్లాన్‌పై సమన్వయ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ రాజర్షి షా అధ్యక్షతన జరిగిన ఈ సమావేషంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, MP నగేశ్ పాల్గొన్నారు. భూ సేకరణకు సంబంధించిన సవాళ్లు, మాస్టర్ ప్లాన్ పరిధిలో వివిధ శాఖలు ప్రతిపాదించిన అభివృద్ధి పనులపై చర్చించారు. ప్రాజెక్టు కారణంగా ప్రభావితమయ్యే ఆస్తులు, రహదారులు భవనాలపై మాట్లాడారు.
Similar News
News March 1, 2026
రామన్నపేట: డిగ్రీ పూర్తి చేయలేకపోయారా.. ఇది మీకోసమే

డిగ్రీ పూర్తి చేయలేకపోయిన వారికి MGU సువర్ణావకాశం కల్పించింది. రామన్నపేట డిగ్రీ కాలేజీలో 2010–11 నుంచి నేటి వరకు పాత(ఇయర్/సెమిస్టర్), నూతన విధానం(సెమిస్టర్)లో డిగ్రీ సకాలంలో పూర్తి చేయలేకపోయిన వారికి అవకాశం కల్పిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రొ.డా.రాహత్ ఖానం, అకాడమిక్ కోఆర్డినేటర్ డా.J.చిన్నబాబు తెలిపారు. పరీక్ష ఫీజు చెల్లించడానికి MAR 4 చివరి తేదీ అని, బ్యాక్‌లాగ్ ఉన్నవారు ముందుకు రావాలని కోరారు.
News March 1, 2026
ఖమేనీ అంతం… US తదుపరి అడుగులు ఏమిటి

ఇరాన్ ‘సుప్రీం’ ఖమేనీని అంతం చేసిన US అక్కడి ప్రభుత్వ మార్పుపై ఏం చేయబోతుందనేది ఆసక్తిగా మారుతోంది. ఇరాక్‌లో సద్దాం అంతం అనంతరం ప్రజా ప్రభుత్వం ఏర్పాటైనా US అండతోనే పాలన సాగింది. వెనిజులాలో అధ్యక్షుడు మదురోను అరెస్టు చేసినా అక్కడి ప్రభుత్వాన్నే కొనసాగించింది. అయితే ఇరాన్‌లో అలా సాధ్యం కాదని, భిన్నమైన వ్యూహంతో వెళ్లొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్గత కలహాలతో GOVT కూలిపోవచ్చంటున్నారు.
News March 1, 2026
పోకో, రెడ్‌మీ ఫోన్ల ధరలూ పెరిగాయి

ఇప్పటికే వివో, iQOO, శాంసంగ్ సంస్థలు <<19253401>>ఫోన్<<>> ధరలు పెంచేయగా.. ఈ లిస్ట్‌లో ఇప్పుడు మరో రెండు బ్రాండ్లు చేరాయి. పోకో తన C75, M7, C85, M7 ప్లస్, F7 మోడళ్లలోని వివిధ వేరియంట్లపై ₹1000-₹2500 వరకు ధరలు పెంచింది. ఇకపై పోకోలో బేస్ మోడల్ ఫోన్ ధర ₹10,999గా ఉండనుంది. ఈ హైక్ ఈరోజే అమలులోకి రానుంది. రెడ్‌మీ సైతం ఇదే స్థాయిలో పెంచినట్లు సమాచారం. మెమొరీ చిప్‌ల కొరతతో కంపెనీలు ధరలు పెంచాల్సి వస్తోంది.


