News March 2, 2025
ఆదిలాబాద్ AIRPORT కలగానే మిగిలిపోతుందా..?

ఆదిలాబాద్‌లో AIRPORT కలగానే మిగిలిపోతోంది. రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం వరంగల్ AIRPORTకు అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాగా జిల్లాలో కూడా ఎయిర్ పోర్టు నిర్మాణానికి త్వరగా అడుగులు పడేలా చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు. AIRPORT నిర్మాణానికి స్థలం ఉన్నప్పటికీ దానికి సంబంధించిన పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Similar News
News December 27, 2025
WGL: తాగి బండి నడిపిన వాళ్లు ఎంతమందో తెలుసా..?

వరంగల్ కమిషనరేట్‌లో డ్రంకన్ డ్రైవ్‌లో 35,513 మంది పోలీసులకు చిక్కారు. <<18684848>>జనవరి నుంచి ఈరోజు వరకు <<>>పట్టుబడిన వారి నుంచి రూ.2.19 కోట్ల ఫైన్‌లు వసూలు చేయగా.. 887 మందికి జైలు శిక్ష పడింది. 329 మంది డ్రైవింగ్ లైసెన్సులు రద్దు, రాంగ్ రూట్ డ్రైవ్ 9,997, సెల్ మాట్లాడుతూ నడిపిన కేసులు 14,407, సిగ్నల్ జంప్ 13,024, లెసెన్సు లేకుండా నడిపిన వాళ్లు 97,020, హెల్మెట్ లేకుండా 9,04,287 తదితర కేసులు నమోదయ్యాయి.
News December 27, 2025
కృష్ణా జిల్లాలో 60 పోస్టులకు నోటిఫికేషన్

AP: హెల్త్ మెడికల్&ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ కృష్ణా జిల్లాలో 60 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 31 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, MLT, BSc(MLT), ఇంటర్ ఒకేషనల్ (MLT, ఫార్మసీ), DMLT, డిప్లొమా, బీఫార్మసీ, PGDCA, డిగ్రీ(కంప్యూటర్స్) ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42 ఏళ్లు. వెబ్‌సైట్: https://krishna.ap.gov.in/
News December 27, 2025
ఒక్కరోజు ముందే పెన్షన్ పంపిణీ: కలెక్టర్

నూతన సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం జనవరి 1 ఇవ్వాల్సిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లను ఒకరోజు ముందుగానే ఈనెల 31 పంపిణీ చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సిబ్బందికి సూచించారు. జిల్లాలోని అన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పెన్షన్ల పంపిణీ అవసరమయ్యే నగదును సిద్ధం చేసుకోవాలన్నారు.


