News March 26, 2025

ఆదిలాబాద్: CCI సాధన కమిటీ కార్యాచరణ ఇదే.!

image

ఆదిలాబాద్ సీసీఐ సాధన కమిటీ సమావేశాన్ని మంగళవారం సుందరయ్య భవనంలో నిర్వహించారు. మాజీ మంత్రి జోగురామన్న, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మార్చి 28న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ వస్తున్నారని తెలిపారు. ఏప్రిల్ 1న ఛలో ఢిల్లీ, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేపట్టనున్నామని, ఉద్యమ ఫొటో, ఫ్లెక్సీలు పెట్టాలని సూచించారు. రోజూ సాయంత్రం 4 గంటలకు సీసీఐ సాధన పోరాట కమిటీ సమావేశం నిర్వహించాలని తీర్మానించామన్నారు.

Similar News

News February 23, 2026

38 ఫిర్యాదులు స్వీకరించిన ఆదిలాబాద్ SP

image

బాధితుల పట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం అండగా ఉంటుందని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సోమవారం పోలీసు ముఖ్య కార్యాలయంలో గ్రీవెన్స్ డే సందర్భంగా ప్రజా ఫిర్యాదులను నేరుగా స్వీకరించారు. వెంటనే స్పందించిన ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు ఇచ్చి సత్వరమే పరిష్కరించాలని సూచించారు. జిల్లా నలుమూలల నుంచి దాదాపు 38 ఫిర్యాదుదారులు తమ సమస్యలను ఎస్పీకి తెలియజేశారు.

News February 23, 2026

ఆదిలాబాద్ గ్రీవెన్స్ డేలో 44 ఫిర్యాదులు: ఎస్పీ

image

ఆదిలాబాద్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో 44 ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తక్షణమే స్పందించి సంబంధిత అధికారులకు పరిష్కార ఆదేశాలు జారీ చేశారు. బాధితుల సమస్యలపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం 8712659973 వాట్సాప్ నంబర్‌కు పంపవచ్చని, వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.

News February 23, 2026

ఆదిలాబాద్: జాబ్ గ్యారంటీ కేంద్రాలుగా పాలిటెక్నిక్

image

పాలిటెక్నిక్‌లను జాబ్ గ్యారంటీ కేంద్రాలుగా ఉన్నతీకరించామని, ఉపాధి అవకాశాల కోసం వీటిలో చేరాలంటూ సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక ప్రచారం ప్రారంభించిందని ADB సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ నరేశ్ తెలిపారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, గురుకులాలకు వెళ్లి పదో తరగతి విద్యార్థులకు POLYCETపై అవగాహన కల్పించామన్నారు. ఈ సంవత్సరంకొత్త కోర్సులు అందుబాటులో వచ్చాయన్నారు.