News July 25, 2024

ఆదిలాబాద్: DEECET ఫలితాలు విడుదల

image

డిప్లమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (D.ED) కళాశాలలో సీట్ల భర్తీ కోసం ఈ నెల 10న ఆన్‌లైన్‌లో నిర్వహించిన డీఈఈసెట్‌-2024 పరీక్ష ఫలితాలు విడుదలైనట్లు ఆదిలాబాద్ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. ఫలితాల కోసం https://deecet.cdse.telangana.gov.in/ వెబ్ సైట్‌ను సందర్శించాలని సూచించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియ, వెబ్‌ ఆప్షన్ల నమోదు వంటి తేదీలు త్వరలో విడుదల చేస్తామన్నారు.

Similar News

News November 1, 2025

ఆదిలాబాద్: ప్రభుత్వ పథకాలపై సమగ్ర అధ్యయనం

image

క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ పథకాలపై సమగ్ర అధ్యయనం చేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం అధ్యయనం నిమిత్తం జిల్లాకు వచ్చిన IAS, IPS, IRS, IES, ISS అధికారులకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. సమావేశంలో DFO ప్రశాంత్ బాజీరావు పాటిల్, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, అదనపు ఎస్పీ కాజల్, శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, అధికారులు పాల్గొన్నారు.

News November 1, 2025

ADB: స్వయం ఉపాధి దిశగా యువత ముందుకు రావాలి: కలెక్టర్

image

ప్రభుత్వం అందిస్తున్న నైపుణ్యాభివృద్ధి అవకాశాలను యువత పూర్తిగా వినియోగించుకోవాలని కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. శనివారం ఆదిలాబాద్‌లోని టీటీడీసీ భవనంలో నిర్వహించిన ఇందిరమ్మ సెంట్రింగ్ యూనిట్ ట్రైనింగ్ ప్రోగ్రాం ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు.

News November 1, 2025

భీంపూర్‌లో పులి సంచారం

image

భీంపూర్ మండలంలో పులి సంచారం రైతులకు కునుకు లేకుండా చేస్తుంది. శనివారం ఉదయం పిప్పల్ కోటి, గూడ గ్రామాల శివారులోని యాల్ల కేశవ్, పొగుల రమేశ్ పంట పొలాల్లో పులి కనిపించింది. గమనించిన కూలీలు భయంతో ఇంటికి వెళ్లిపోయినట్లు గ్రామస్థలుు తెలిపారు. కాగా ప్రస్తుతం పులి గర్భం దాల్చినట్లు గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేశారు.