News October 28, 2025

ఆదిలాబాద్: DEGREE ఫీజు కట్టారా..?

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 1, 3, 5 సెమిస్టర్ పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపు గడువును పొడగిస్తున్నట్లు KU అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 27 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించడానికి గడువు ముగిసింది. రూ.50 అపరాధ రుసుముతో ఈనెల 29 వరకు పొడగించినట్లు వెల్లడించారు. నవంబర్ నెలలో పరీక్షలు ఉంటాయని వివరించారు. కావున విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి సకాలంలో ఫీజు చెల్లించాలని సూచించారు.

Similar News

News October 28, 2025

నెల్లూరు జిల్లాలో రేపు కూడా సెలవు

image

తుఫాను నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, అంగన్వాడీలు, జానియర్ కళాశాలకు బుధవారం సైతం సెలవు ఇస్తున్నామని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఓ ప్రకటనలో తెలిపారు. విధిగా సెలవు ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

News October 28, 2025

సుంకేసులకు కొనసాగుతున్న వరద

image

రాజోలి మండలంలోని సుంకేసుల జలాశయానికి వరద కొనసాగుతుంది. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలు, వాగులు, వంకల ద్వారా వచ్చిన నీటితో జలాశయం నిండుకుండలా మారింది. మంగళవారం సాయంత్రం జలాశయానికి 56,500 క్యూసెక్కుల వరద వస్తుంది. దీంతో బ్యారేజీ 13 గేట్లు ఒక మీటర్ మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. గేట్ల ద్వారా 52,364 క్యూసెక్కులు, కేసీ కెనాల్‌కు 458 క్యూసెక్కులు, మొత్తం 52,822 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

News October 28, 2025

‘వుషు’ పోటీల్లో సత్తా చాటిన గోదావరిఖని క్రీడాకారులు

image

ఈ నెల 26న నిజామాబాద్‌లో ఖేలో ఇండియా రాష్ట్రీయ వుషు ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో గోదావరిఖనికి చెందిన విద్యార్థులు జిల్లా తరఫున పాల్గొన్నారు. అండర్‌ 17- 60 కేజీల విభాగంలో సిగిరి శ్రావ్యంజలి బంగారు, అండర్‌ 12 -25 కేజీల విభాగంలో యాసర్ల అరుషి వెండి, అండర్‌ 14 – 45 కేజీల విభాగంలో బూడిద ఉధంతిక కాంస్య పతకాలు సాధించారు. వీరిని పెద్దపల్లి జిల్లా జనరల్‌ సెక్రటరీ కుమార్‌ అభినందించారు.