News January 7, 2025

ఆదిలాబాద్ DSPగా విజయ్ కుమార్

image

అవినీతి నిరోధక శాఖ ఆదిలాబాద్ DSPగా పి.విజయ్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. వికారాబాద్ నుంచి ఆదిలాబాద్‌కు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు కార్యాలయ సిబ్బంది బొకో అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని, ఎవరైనా అధికారులు లంచం అడిగితే ఏసీబీకి సంప్రదించాలని సూచించారు. టోల్ ఫ్రీ నెంబర్ 1064లో వివరాలు తెలియజేయాలన్నారు.

Similar News

News January 8, 2025

ADB: వన్యప్రాణులకు ఉచ్చు.. ముగ్గురి రిమాండ్

image

వన్యప్రాణుల కోసం విద్యుత్ తీగలు అమర్చిన ముగ్గురు వ్యక్తులను రిమాండ్ చేసినట్లు రేంజ్ అధికారి ముసవీర్, డిప్యూటీ రేంజ్ అధికారి శ్రావణ్ తెలిపారు. బెజ్జూర్ రేంజ్ పరిధిలోని ఏటిగూడ సమీపంలో రిజర్వ్ అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కోసం ఏటిగూడెంకు చెందిన మడే ప్రభాకర్, తుమ్మల మహేష్, జక్కం వినోద్ కుమార్ విద్యుత్ అమరుస్తుండగా పట్టుకున్నామన్నారు. వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు.

News January 8, 2025

జర్నలిస్టులపై మంచిర్యాల MLA వివాదాస్పద వ్యాఖ్యలు

image

మంచిర్యాల ఎమ్మెల్యే జర్నలిస్టులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని TUWJ(IJU) నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్ష్య,కార్యదర్శులు సత్యనారాయణ, సంపత్‌రెడ్డి ప్రకటనలో విడుదల చేశారు. తాను తలుచుకుంటే ఆదిలాబాద్ జిల్లాలో సగం పత్రికలు,TVచానళ్లను మూసి వేయిస్తానని హెచ్చరించే ధోరణిలో వ్యాఖ్యానించడాన్ని సంఘం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. తక్షణమే వ్యాఖ్యలను వాపస్ తీసుకున్నట్లు ప్రకటించాలన్నారు.

News January 8, 2025

చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు: నిర్మల్ SP

image

నిబంధనలకు విరుద్ధంగా చైనా మాంజా విక్రయించినట్లయితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకీషర్మిల ప్రకటనలో తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు దుకాణాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. చైనా మాంజా వాడితే ప్రజలు, జంతువులకు ప్రాణాపాయం వాటిల్లే అవకాశం ఉందని పేర్కొన్నారు. చైనా మాంజా కట్టడికి పోలీసు శాఖ చర్యలు తీసుకుంటుందని చెప్పారు.