News December 23, 2025
ఆదిలాబాద్: INTER విద్యార్థులకు గమనిక

ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించని వారికి బోర్డు మరొక అవకాశం కల్పించినట్లు ఆదిలాబాద్ DIEO జాధవ్ గణేష్ కుమార్ తెలిపారు. ఈ నెల 16తోనే ఫీజు చెల్లింపు గడువు ముగియగా దానిని ఈ నెల 31 వరకు అపరాధ రుసుము రూ.2000తో పొడగించినట్లు తెలిపారు. ఇంకా ఫీజు చెల్లించని మొదటి, రెండవ సంవత్సర విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఫీజు చెల్లించాలని సూచించారు.
SHARE IT..
Similar News
News December 26, 2025
శ్రీకాళహస్తి మున్సిపల్ ఆఫీసులో ఉద్యోగాలు

శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో పబ్లిక్ హెల్త్ వర్కర్లు(శానిటేషన్), నాన్ పబ్లిక్ హెల్త్ వర్కర్లు(ఇంజినీరింగ్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కమిషనర్ భవాని ప్రసాద్ తెలిపారు. జనవరి 6వ తేదీ సాయంత్రం 5గంటల లోపు అప్లికేషన్లు సమర్పించాలని కోరారు. పబ్లిక్ హెల్త్ వర్కర్లకు నెలకు రూ.21వేలు, నాన్ పబ్లిక్ హెల్త్ వర్కర్లకు నెలకు రూ.18,500 జీతం ఉంటుందని చెప్పారు. కనీసం 7వ తరగతి అర్హత ఉండాలన్నారు.
News December 26, 2025
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

కేంద్ర ప్రభుత్వ పథకాల పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎస్పీ కృష్ణారావు సూచించారు. ప్రభుత్వ పథకాల కోసం అంటూ వాట్సాప్‌లో వచ్చే లింకులు, యాప్‌లు, APK ఫైళ్లు మోసపూరితమైనవని తెలిపారు. PM-KISan, ముద్ర లోన్ పేరుతో వచ్చే సందేశాలను నమ్మవద్దని, బ్యాంక్ వివరాలు, OTP సమాచారం ఎవరికీ ఇవ్వవద్దని హెచ్చరించారు. సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలన్నారు.
News December 26, 2025
సంగారెడ్డి: ‘ఓపెన్ స్కూల్ తరగతులను వినియోగించుకోవాలి’

జిల్లాలో ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్ తరగతులలో ప్రవేశం పొందిన అభ్యర్థులు ప్రతి ఆదివారం నిర్వహించే తరగతులకు హాజరు కావాలని ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ వెంకటస్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనుభవజ్ఞులైన ప్రభుత్వ ఉపాధ్యాయులచే తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


