News April 3, 2025

ఆదిలాబాద్: KU.. గడువు మరోసారి పొడిగింపు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును మరోసారి పొడిగిస్తున్నట్లు KU అధికారులు పేర్కొన్నారు. నేటితో ఈ గడువు ముగియనుండగా ఏప్రిల్ 7 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించవచ్చని పేర్కొన్నారు. రూ.50 ఫైన్‌తో ఏప్రిల్ 9 వరకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

Similar News

News April 4, 2025

ADB: ‘ఏప్రిల్ 20 నుంచి పరీక్షలు నిర్వహించాలి’

image

ఓపెన్ స్కూల్ సోసైటి ద్వారా జిల్లాలో నిర్వహించనున్న పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ కే.శ్యామలాదేవి అన్నారు. గురువారం వివిధ పరీక్ష నిర్వహణ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. పదో తరగతి పరీక్షలకు 623 మంది, ఇంటర్మీడియట్ పరీక్షలకు 465 మంది హాజరవుతారన్నారు. వీరికి ఏప్రిల్ 20వ తేది నుంచి ఏప్రిల్ 26 వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు.

News April 4, 2025

నార్నూర్: యాక్సిడెంట్.. యువకుడి దుర్మరణం

image

నార్నూర్ మండలం గంగాపూర్‌లో ఎంగేజ్మెంట్‌కి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో పుసిగూడ ఘాట్ వద్ద జరిగిన యాక్సిడెంట్‌లో యువకుడు దుర్మరణం చెందారు. యువకుడిని ఆటోలో ఉట్నూర్ ఆసుపత్రికి తరలించగా మృతిచెందారు. మృతుడు తొడసం జంగుగా గుర్తించారు. తిర్యాణి మండలం సుంగాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడికి భార్య పిల్లలు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 4, 2025

CCI పునరుద్ధరణపై లోక్‌సభలో మాట్లాడుతా: NZB MP

image

ADBలో సీసీఐ ఫ్యాక్టరీ రీఓపెన్‌పై పార్లమెంట్‌లో మాట్లాడాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌ను CCI సాధన కమిటీ సభ్యులు కోరారు. న్యూ ఢిల్లీ కొత్త పార్లమెంట్ భవన్‌లో ఎంపీ అర్వింద్‌ని గురువారం సభ్యులు కలిసి విన్నవించారు. వారి న్యాయమైన డిమాండ్ గురించి కచ్చితంగా పార్లమెంట్‌లో మాట్లాడుతానని ఎంపీ హామీ ఇచ్చారన్నారు. మాజీ మంత్రి జోగు రామన్న సీసీఐ సాధన కమిటీ సభ్యులు ఉన్నారు.

error: Content is protected !!